Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూజిల్లా కమిటీ సభ్యులు గుమ్మడి కురుమయ్య
- గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ మండల కమిటీ ఎన్నిక
నవతెలంగాణ - మాడ్గుల
గ్రామపంచాయతీ సిబ్బందిని హైకోర్టు తీర్పు ప్రకారం పర్మినెంట్ చేయాలని అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యు లు గుమ్మడి కురుమయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మాడ్గుల మండల కేంద్రంలో ఆదివారం గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కమిటీని ఎన్ను కున్నారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజ రై మాట్లాడారు.. 11వ పీఆర్సీ ప్రకారం జీవో నెంబర్ 60ని వెంటనే అమలు చేసి కేటగిరీల వారీగా వేతనాలు చెల్లిం చాలని డిమాండ్ చేశారు. మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దుచేసి కారోబార్ బిల్ కలెక్టర్లకు స్పెషల్ స్టేటస్ కల్పిం చాలని కోరారు. కరోనా సమయంలో ముందు వరుసలో పనిచేసిన గ్రామపంచాయతీ సిబ్బందికి ఇన్సూరెన్స్ సౌక ర్యం కల్పించాలన్నారు. అదేవిధంగా కార్మికుల పైన ప్రజా ప్రతినిధుల అధికారుల వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. పనిచేస్తున్న ప్రతి కార్మికునికీ ప్రతినెలా రూ.8, 500 వేతనం బ్యాంకు ద్వారా చెల్లించాలని తెలిపారు. రా బోయే కాలంలో ప్రభుత్వంలో గ్రామపంచాయతీ కార్మికుల పట్ల వ్యవహరిస్తున్న విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడు తూ మండలంలో పోరాటాలు నిర్వహిస్తామని ఈ సమావేశం సందర్భంగా హెచ్చరించారు.
గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఎన్నిక
గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూని యన్ మండల నూతన కమిటీని 18 మందితో ప్రజాసం ఘాల నాయకులు ఎస్.శ్రీను అధ్యక్షతన ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షులుగా సభావాత్ శ్రీను నాయక్, ప్రధాన కార్యదర్శిగా సయ్యద్ అజిముద్దిన్, ఉపాధ్యక్షులుగా గోరంట్ల లాలయ్య, మహిపాల్, జడల వెంకటయ్య, సహాయ కార్యదర్శులుగా గజ్జ నిర్మల, పల్లెటి జంగయ్య, రెడ్యానాయక్, సుగుణమ్మ, కోశాధికారిగా అన్య పాక జంగయ్య, మండల కమిటీ సభ్యులుగా ముత్తయ్య చెన్నయ్య, సీతారాములమ్మ, వడ్డమోని కిష్టయ్య, దీప్లానా యక్, పల్లేటి లింగయ్య లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.