Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీసీసీ సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్
నవతెలంగాణ-ఆమనగల్
పదవులు ఆశించని ప్రజానాయకుడు రాహుల్ గాంధీ అని టీపీసీసీ సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఏఐసీసీ ప్రధాన నాయకులు రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో యాత్ర ఆదివారం రంగారెడ్డి జిల్లాకు చేరుకుంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీతో కలిసి టీపీసీసీ సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్ భారత్ జోడో పాదయాత్రలో పాల్గొన్నారు. అనంతరం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రవేటీకరణ విధానాలతో దేశం విచ్ఛిన్నకర శక్తుల చేతు ల్లోకి వెళ్ళకుండా ప్రజలను చైతన్య పర్చాలనే లక్ష్యంతో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ చేప డుతున్న భారత్ జోడో యాత్ర చారిత్రాత్మకంగా నిలిచి ఉంటుందని అన్నారు. గతంలో ఎవ్వరూ చేయని విధంగా రాహుల్ గాంధీ చేపడుతున్న సాహసోపేతమైన పాద యాత్రకు కులమతాలకు అతీతంగా వర్గ విభేదాలు లేకుం డా ఆయా ప్రాంతాల్లోని ప్రజలు భారత్ జోడో యాత్రకు బ్రహ్మరథం పడుతున్నారని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.