Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రారంభించిన ఎమ్మెల్యే గాంధీ
నవతెలంగాణ-చందానగర్
హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని వైశాలి నగర్ నుండి కొండాపూర్ మై హౌమ్ మంగళ వైపు వెళ్లే వాహనదారులుకు ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి రైల్వే ట్రాక్ నందు ట్రాఫిక్‌ను ఆటోమెటిగ్గా కంట్రోల్ చేసేం దుకు కొత్తగా ఏర్పాటు చేసిన, ఆటోమెటిక్ సిగల్ వ్యవ స్థను కార్పొరేటర్లు, పూజిత జగదీశ్వర్ గౌడ్, జగదీశ్వర్ గౌడ్, ట్రాఫిక్ ఏసిపి హనుమంతరావు, ట్రాఫిక్ సిఐ సుమ న్‌తో కలిసి ముఖ్యఅతిథిగా ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆరేకపూడి గాంధీ. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ మంజీర పైప్ లైన్ రోడ్డులో వైశాలినగర్ నుండి కొండాపూర్మై హౌమ్ మంగళ వైపు వెళ్లే వాహన దారుల ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఆటోమేటిక్ సిగల్ వ్యవస్థను ఏర్పాటు చేయడం శుభపరిణామని, ట్రాఫిక్ సిగళ్ల వద్ద వెయిటింగ్ సమస్యకు చెక్, ఇక అంతా ఆటో మెటిక్ అని కూడళ్లలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరి ష్కారం దిశగా ఆటోమేటిక్ సిగల్ వ్యవస్థను తీసుకొ చ్చారని ఎన్నో ఏండ్ల సమస్య నేటితో తిరినది అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. ప్రజలకు ట్రాఫిక్ రహిత సుఖ వంతమైన ప్రయాణనికి బాటలు వేశామని ప్రభుత్వ విప్ గాంధీ తెలిపారు. కార్యక్రమంలో హఫీజ్పెట్ డివిజన్ గౌరవ అధ్యక్షులు వాలా హరీష్ రావు, హఫీజ్పెట్ డివిజన్ అధ్య క్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్ టీఆర్ఎస్ నాయకులు వెంక టేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్ కాలనీ వాసులు పాల్గొన్నారు.