Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శంకర్పల్లి
శంకర్పల్లి జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్లో పాఠ శాల అదనపు గదుల కోసం ఆదివారం ఉపాధ్యాయులు శ్రీను, శ్రీనివాస్‌తో కలిసి శంకుస్థాపన చేశామని రౌండ్ టేబుల్ చైర్మన్ రామన్ తెలిపారు. హైదరాబాద్ ఏరియా రౌండ్ టేబుల్ 134 దివ్య శక్తి ఇండియా ప్రయివేట్ లిమిటెడ్ వారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు 10 గదుల నూతన భవనానకి అంగీకారం తెలిపారు. సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా పరిషత్ బాలుడు ఉన్నత పాఠశాలలో గదుల కొరత ఉన్నందు వలన రౌండ్ టేబుల్ తరపున ప్రత 10 గదులను నిర్మించేందుకు సమా వేశంలో తీర్మానం చేశామన్నారు. ప్రధానోపాధ్యా యులు పి లక్ష్మయ్య మాట్లాడుతూ హైదరాబాద్ ఏరియా రౌండ్ టేబు ల్ వారికి ఉపాధ్యాయులు, పాఠశాల, విద్యార్థుల తరఫున ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీను, శ్రీనివాస్ జోషి రామన్ ఛైర్మెన్, అగర్వాల్, సునీత్ గాంధీ, నిర్మల్, కుమార్, సచిన్, సభరాకేష్ బిల్డర్ రాము పాల్గొన్నారు.