Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆమనగల్
ఆమనగల్ పట్టణంలో ఆదివారం శ్రీకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో సదర్ సమ్మేళన ఉత్సవాలు కన్నుల పండువగా జరిగాయి. పట్టణంలో సదర్ ఉత్సవాలు నిర్వ హించడం ఇదే మొదటిసారి కావడంతో నిర్వాహకులు భా రీ ఏర్పాట్లు చేశారు. గ్రామస్తులతో పాటు వందలాది కు టుంబాల యాదవ సంఘం సభ్యులు వేడుకల్లో పాల్గొన్నా రు. దేవతల కాలంలో కృష్ణుడు గోవుల కాపరిగా ఉంటూ గోవుల గొప్పదనాన్ని తెలిపారని సదర్ నిర్వాహకులు తెలి పారు. అందులో భాగంగా యాదవుల సంపదకు ప్రతీకగా గోసంపద ప్రాముఖ్యతను చాటి చెప్పడమే ఈఉత్సవాల ముఖ్య ఉద్దేశమని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా దు న్నలను అందంగా అలంకరించి పట్టణంలోని ప్రధాన వీధులగుండా ఆట పాటలతో భారీ ర్యాలీ నిర్వ హించారు. కార్యక్రమానికి ముఖ్యతిథులుగా కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్క జైపాల్ యాదవ్ హాజరై మాట్లాడారు. శ్రీకృష్ణ యాదవ సంఘం అధ్యక్షులు, ఆమనగల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ తోట గిరియాదవ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం లో జడ్పీటీసీలు నేనావత్ అనురాధ పత్యనాయక్, విజితా రెడ్డి, ఏఎంసీ చైర్మెన్ నాలాపురం శ్రీనివాస్ రెడ్డి, రైతు సమన్వయ కమిటీ మండల అధ్యక్షులు నిట్ట నారాయణ, సంఘ సేవకులు పాపిశెట్టి రాము, సీనియర్ నాయకులు ముక్కరి కృష్ణయ్య, శ్రీకృష్ణ యాదవ సంఘం నాయకులు, యాదవ కులబాంధవులు, యువతీ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.