Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉచితంగా మందుల పంపిణీ
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
ప్రతి పేదవాడికి ఉచిత వైద్యం అందించాలనే ఉద్దేశంతో కూకట్ పల్లి పార్ట్ -2 ప్రగతి నగర్లో జి వై ఫౌండేషన్ ఫౌండర్ ట్రస్టీ గజ్జల యోగానంద్ ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి మంచి స్పందన వచ్చిందని కార్య క్రమానికి అధ్యక్షత వహించిన డివిజన్ అధ్యక్షులు భూపాల్ రెడ్డి అన్నారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్స్ సహకారంతో ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి హాజరైన గజ్జల యో గానంద్ మాట్లాడుతు అందరూ ఆరోగ్యంగా ఉంటేనే సమాజం బాగుంటుందని. నిరుపేద కుటుంబానికి వైద్యం అందించాలనే లక్ష్యంతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశా మన్నారు. ప్రజలు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం తమ వాడలో ఏర్పాటు చేసినందుకు ప్రజలు ధన్యవా దాలు తెలిపారు. వైద్య శిబిరంలో బిపి, షుగర్ పరీక్షలు, కంటి పరీక్షలు చేశారు. ప్రజలకు ఉచితంగా మందులు పంపిణీ చేసి, వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్య క్రమంలో రాష్ట్ర కార్య వర్గ సభ్యులు పర్వాతాలు యాదవ్, బీజేవైఎం రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ అక్కినపల్లి సాయికుమార్, డివిజన్ ప్రధాన కార్యదర్శులు గంగుల రాజిరెడ్డి, పాశం శ్రీకాంత్ యాదవ్, మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీలత, యువ మోర్చా అధ్యక్షుడు అవినాష్, మహిళా మోర్చా నాయకు రాలు సంధ్య, సుకన్య, రత్నాలు, సక్కుబాయి, సీనియర్ నాయకులు రాములు, యువమో ర్చా నాయకులు యశ్వంత్, వెంకట్ గిరీష్ శంకర్ కిరణ్ శేఖర్ దిల్లేశ్వరరావు సుధాకర్ పాల్గొన్నారు.