Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ అసెంబ్లీ ఇన్చార్జి, కంటెస్టెడ్ ఎమ్మెల్యే గజ్జల యోగానంద్
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
మియాపూర్ డివిజన్లోని నడిగడ్డతండా వాసులను అక్రమంగా అరెస్టు చేయడంపై బీజేపీ అసెంబ్లీ ఇన్చార్జి, కంటెస్టెడ్ ఎమ్మెల్యే గజ్జల యోగానంద్ మంగళవారం ఖండించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో కురిసిన భారీ వర్షాల కారణంగా నడిగడ్డతండాలో చాలా ఇండ్లు కూలిపోవడం జరిగిందనీ, అందుకు మరమ్మతులు చేపట్టాలని తండావాసులు చిన్న ఆటోట్రాలీలో ఇసుక తీసుకు వస్తుండగా వాటిని సీఆర్పీఎఫ్ వాళ్లు అడ్డుకున్నారని తెలిపారు. అందుకు నిరసనగా తండావాసులను సీఆర్పీఎఫ్ వాళ్లు, పోలీసులను పిలిపించి, అక్రమంగా తండావాసులను అరెస్టు చేయడం సరైంది కాదన్నారు. ఇదంతా స్థానిక టీఆర్ఎస్ కార్పొరేటర్, ఎమ్మెల్యే కలిసి ఆడుతున్న నాటకమని ఆరోపించారు. వారికి తప్పకుండా ప్రజలే బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయన్నారు. ఇప్పటికైనా వెంటనే నడిగడ్డతండా వాసులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అరెస్టు అయిన వారిలో తండా వాసులు, నడిగడ్డతండా గిరిజన సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి, బీజేపీ మియాపూర్ డివిజన్ ఉపాధ్యక్షులు నాయిని రత్నకుమార్, రంగారెడ్డి జిల్లా బీజేపీ, ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు దేవునూరు చందు, బీజేపీ మియాపూర్ డివిజన్ ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఆంజనేయులు, బీజేవైఎం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి కుమార్ సాగర్, క్రిష్ణానాయక్, మోహన్ నాయక్, మహేష్, ఈశ్వర్, రమేష్, సంపత్, రవి నాయక్లను వెంటనే విడుదల చేయాలని యోగానంద్ డిమాండ్ చేశారు.