Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రంగారెడ్డి జిల్లా సర్పంచ్ సంఘం, జిల్లా అధ్యక్షులు రవీందర్ గౌడ్
నవతెలంగాణ-శంకర్పల్లి
గ్రామంలో అభివృద్ధి పనులు చూసి ఓర్వలేకనే శంకర్పల్లి మండలం మిర్జాగూడ గ్రామ మాజీ సర్పంచ్ పంతం మల్లేష్,పంతం సంజీవ తనపై ఆరోపణలు చేస్తున్నారని రంగారెడ్డి జిల్లా సర్పంచ్ సంఘం, జిల్లా అధ్యక్షులు రవీందర్ గౌడ్ అన్నారు. మంగళవారం శంకర్‌పల్లిలో విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ సోమవారం భూమి కబ్జా చేశారనీ తప్పుడు ఆరోపణలు చేసి అధికారులకు ఫిర్యాదు చేయడం సరైంది కాదన్నారు. గతంలో వీరు మిర్జాగూడ గ్రామపంచాయతీ అనుబంధ గ్రామమైన ఇంద్రారెడ్డి నగర్లో ప్రభుత్వం కేటాయించిన ప్లాట్లను విచ్ఛలవిడిగా అమ్ముకుని సొమ్ము చేసుకున్నారని ఆరోపించారు. ఈ విష యంలో మూడుసార్లు సస్పెండ్ వేటుపడిందన్నారు. అలాంటిది నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ, గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న తనపై ఆరోపణలు చేయడం సరైంది కాదన్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్యే కాలే యాదయ్య సహకారంతో ప్రత్యేక నిధులు తీసుకువచ్చి మిర్జాగూడ ఇంద్రారెడ్డి నగర్లో సీసీరోడ్లు, అండర్ డ్రయినేజీ నిర్మాణ పనులు, వీధి దీపా లాంటివి ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టినుట్ట వివరించారు. రాజకీయంగా ఎదు ర్కోలేకనే తనపై తప్పుడు ఆరోప ణలు చేయడం మానుకోవాలని హితువు పలికారు. సర్వేనెంబర్ ఎనిమిది వెంకన్నగుట్టలో ఐదు ఎకరాల ప్రభుత్వ స్థలం కబ్జా చేసి, మాజీ సర్పంచులు పంతం మల్లేష్ ,పంతం సంజీవలు రియాల్టార్లకు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారని రవీందర్ గౌడ్ ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు చేస్తున్న అక్రమాలను అడ్డుకోవాలని జిల్లా కలెక్టర్‌ను రవీందర్ గౌడ్ కోరారు. ఆయనతో పాటు ఇంద్రారెడ్డి నగర్ కాలనీవాసులు తదితరులు ఉన్నారు.