Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్రాఫిక్ కానిస్టేబుల్ హరీష్
నవతెలంగాణ-షాబాద్
రోడ్డు నిబంధనలపై ప్రతి ఒక్కరికీ అవగాహన తప్పలనిసరిగా ఉండాలనీ, అప్పుడే ప్రమాదాలు నివారించవచ్చని ట్రాఫిక్ కానిస్టేబుల్ హరీష్ అన్నారు. మంగళవారం తెలంగాణ మాడల్ స్కూల్లో సైబరాబాద్ కమిషనర్, ట్రాఫిక్ డీసీపీ ఆదేశాల మేరకు ట్రాఫిక్ సిబ్బంది హరీష్, మల్లేశ్వర్రావు, యూసుఫు విద్యార్థులకు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాహనదారులు రోడ్డు నిబంధనలు పాటించినప్పుడే ప్రమాదాలను అరికట్టవచ్చని అన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మంట్, కార్లు నడిపించే వాహనదారులు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. ముఖ్యంగా మద్యం తాగి, వాహనాలు నడిపించడం వలన ఎక్కువగా ప్రమాదాలు జరుగు తున్నాయని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలను విద్యా ర్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీవాచ్యా, ఉపాధ్యాయులు, పాల్గొన్నారు.