Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజులారఘునాథ్ రెడ్డి
నవతెలంగాణ-చందానగర్
చందానగర్ డివిజన్ పరిధిలోని గౌతమి నగర్ వేముకుంట కాలనీలో రూ.18 లక్షలతో చేపట్టిన భుగర్భ డ్రయినేజీ పైప్లైన్ పనులు,కాలనీవాసులు అధికారులతో కలిసి చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజులారఘునాథ్ రెడ్డి ప్రారంభించారు. అనంరతం కార్పొరేటర్ మాట్లాడుతూ చందానగర్ డివిజన్ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తామన్నారు. జీహెచ్ఎంసీ పనుల్లో గుత్తేదారులు నాణ్యతా ప్రమాణాలు పాంటించాలని సూచిం చారు. కాలనీవాసులకు ఇబ్బంది కలగకుండా పను లను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి కాలనీ వాసులు రవీందర్ రావు, యూసుఫ్ పాషా , నారాయణ,రాజయ్య, ప్రేమ్చంద్, జైరాజ్, చౌదరి, మీనా, పర్వీన్సుల్తాన్, శ్రీనివాస్, ఖాదర్, జీహెచ్ఎంసీ వర్క్ఇన్స్పెక్టర్ కృష్ణ, సురేందర్ పాల్గొన్నారు.