Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముస్తాబైన సభా ప్రాంగణం
- ఎర్రజెండా తోరణాలతో అలంకరణలు
- జెండావిష్కరణతో ప్రారంభం కానున్న ప్రతినిధుల సభ
- హాజరుకానున్న రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నంద్యాల నర్సిరెడ్డి
- జిల్లా వ్యాప్తంగా హాజరుకానున్న ప్రతినిధులు
నవతెలంగాణ-యాచారం
రంగారెడ్డి జిల్లాలో రైతు సంఘం రెండోవ మహాసభలు ఘనంగా జరగనున్నాయి. ఇందుకు జిల్లా నాయకత్వం సర్వ సిద్ధం చేస్తుంది. సభా ప్రాంగాణ మంతా ఎర్రజెండాలతో ఎరుపెక్కించారు. ఈ మహాసభలకు కేంద్రమైన యాచారం మండలంలో రైతు సంఘం వాల్పోస్టర్లు, జెండాలతో ముస్తాబైంది. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి మధుసూదన్ ఆధ్వర్యంలో నాయకులు వచ్చే డెలిగేట్ల కోసం ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ మహాసభల ప్రాంగణానికి కామ్రేడ్ మల్లు స్వరాజ్యం పేరును పెట్టడం జరిగింది. సభా ప్రాంగణాన్ని రైతు సంఘం తోరణాలతో పేరు పెట్టించే విధంగా సంఘం నాయకులు ముస్తాబు చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ కంపెనీల పేరుతో వ్యవసాయ భూమిలు అన్ని లూటీ అవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లావ్యాప్తంగా ఉన్న వ్యవసాయ భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతిలోకి వెళ్లి రైతులు ఉపాధి కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు ఎంతో కష్టపడి పండించిన పంటలకు కనీస మద్దతు ధర రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. దీంతో వ్యవసాయం కనుమరుగయ్యే ప్రమాదం ఉందన్నారు. అందుకే రైతు సంఘం రెండోవ మహాసభల్లో ప్రధానంగా రైతు సమస్యలపై చర్చించడం జరుగుతుందన్నారు. ఈ మహాసభలకు వచ్చే ముఖ్య అతిథుల కోసం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఆలంపల్లి నరసింహ, రైతు సంఘం నాయకులు చీమలయ్య,సీపీఐ(ఎం) నాయకులు చందు నాయక్, ఆలంపల్లి జంగయ్య, ఆంజనేయులు సార్, రాములు, తదితరులు పాల్గొన్నారు.