Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొడంగల్
కొడంగల్ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా పనిచేస్తున్న బూర్గుపల్లి గణేష్ స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసినట్టు ఎస్ఐ రవిగౌడ్ తెలిపారు. కొడంగల్ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న బూర్గుపల్లి గణేష్ స్వచ్ఛంద పదవీ విరమణ చేయడంతో ఎస్సై రవి గౌడ్, పోలీస్ సిబ్బంది కొడంగల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో వీడ్కోల కార్యక్రమం నిర్వహించి పూలమాలలు, శాలువాతో సన్మానించి, వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఎస్ఐ రవి గౌడ్ మాట్లాడుతూ నల్లగొండ జిల్లా బీబీనగర్ మండలం వెంకిర్యాల గ్రామానికి చెందిన గణేష్ పోలీస్ శాఖలో గత 29 ఏండ్లుగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించినట్టు తెలిపారు. సరూర్నగర్, అల్వాల్, నేరేడ్మెట్, మల్కాజ్గిరి, కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించారు. అనంతరం కోడంగల్ పోలీస్ స్టేషన్లో పది నెలల పాటు విధులు నిర్వహించి స్వచ్ఛంద పదవీ విరమణ పొందుతున్నారని అన్నారు. ఏఎస్ఐగా బూరుగుపల్లి గణేష్ తన విధుల పట్ల అంకితభావంతో, నిబద్ధ తతో, పనిచేసి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నాని అభినందించారు. తన వ్యక్తిగత కారణాలవల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ బాలకిషన్, హెడ్ కానిస్టేబుల్ శివరాం గౌడ్, కానిస్టేబుల్ సమియోద్దీన్, ప్రసన్న కుమార్, హరీష్, బలరాం, హరిలాల్, శ్రీకాంత్ గౌడ్, నరేందర్ రెడ్డి, శంకర్, ఫరీద్, శ్రీకాంత్,దత్తు, ప్రశాంత్, మానస, లలిత, రజియా, సుల్తానా తదితరులు పాల్గొన్నారు.