Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీఆర్టీయూ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డి వివిధ పాఠశాలల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం
నవతెలంగాణ-యాచారం
ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే తమ ధ్యేయమని పీఆర్టీయూ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డి అన్నారు. మంగళవారం యాచారం మండల పరిధిలోని వివిధ పాఠశాలల్లో పర్యటించి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు తనకు వేసి, గెలిపించాలని ప్రచారం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు అనేక సమస్యలు ఎదుర్కొంటు న్నారని తెలిపారు. ఎన్నికల లోపునే బదిలీలు, పదోన్నతులు సాధిస్తామన్నారు. పాఠశాలలకు స్కావెంజర్ల ఏర్పాట్లుకు ప్రభుత్వం పై ఒత్తిడి తెస్తున్నామని వివరించారు. గురుకుల పాఠశాలల టైమింగ్స్ మార్పునకు ప్రభుత్వంతో చర్చిస్తున్నట్టు చెప్పారు.సీపీఎస్ రద్దుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. మార్చిలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ టీఎస్ అధికారిక అభ్యర్థియైన తనకు మొదటి ప్రాధాన్యత ఓటువేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పీఆర్టీయూ హైదరా బాద్ జిల్లా అధ్యక్షులు తిరుపతిరెడ్డి, సరూర్‌నగర్ మండల అధ్యక్షులు రాజేశ్వర్ రెడ్డి, సైదాబాద్ మండలా ధ్యక్షులు వెంకట్రామిరెడ్డి, పీఆర్టీయూ మండలా ధ్యక్షులు మర్పల్లి మహేశ్ యాదవ్, మండల గౌరవ అధ్యక్షులు కలకొండ బోజయ్య, మండల ప్రధాన కార్యదర్శి చాట్ల యాదగిరి, యాచారం కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, రాజేందర్, చింతపట్ల కాం ప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సురేష్, సుభాష్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, విజేందర్‌రెడ్డి, తిరుమలేశ్ జగదీష్, శ్రవణ్, మహేశ్, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.