Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
అవకాశవాద రాజకీయ క్రీడాలకు తెరలేపిన బీజేపీకి ఈ ఉప ఎన్నికలలో మునుగోడు ప్రజలు తగిన బుద్ది చెబుతారని కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రచార కార్యక్రమంలో చివరి రోజు మంగళవారం కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్, చండూర్ మండలంలోని జోగిగూడెం గ్రామంలోని ప్రతి గడపగడపకూ తిరిగి, కారు గుర్తుకు ఓటు వేసి, టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీలోని బీజేపీ పెద్దలకు తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటి చెప్పే అవకాశం నేడు మునుగోడు నియోజకవర్గ ప్రజల చేతులలో ఉందన్నారు. డబ్బు, అవకాశవాదం వంటి ప్రలోబలకు లొంగిపోవటం వల్లే నేడు ఈ ఉప ఎన్నికలు వచ్చాయని, నేడు బీజేపీ పార్టీ చేస్తున్న దుష్ట రాజకీయ చేష్టలకు నేడు జరుగుతున్న మునుగోడు ఉప ఎన్నికలే నిదర్శనంమన్నారు. కార్యక్రమంలో కొండాపూర్ డివిజన్ అధ్యక్షులు అబ్బుల కృష్ణగౌడ్, డివిజన్ సెక్రటరీ, శ్రీరామ్ నగర్ కాలనీ అధ్యక్షులు జె. బలరాం యాదవ్, టీఆర్ఎస్ నాయకులు రక్తపు జంగంగౌడ్, ఆకుల తిరుపతి యాదవ్, పురుషోత్తం, చక్రి యాదవ్, నారాయణ సాగర్ శంకర్ నాయక్, సోమరాజు, సాయిబాబా చౌదరి, లలిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.