Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా నాయకులు ఎండీ జానీపాషా
నవతెలంగాణ-మంచాల
మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలువడం ఖాయమని రంగారెడ్డి జిల్లా నాయకులు ఎండీ జానీపాషా అన్నారు. మంగళవారం మర్రిగూడ మండలంలోని అజీలపూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ గత 15 రోజుల నుంచి ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి తిరుగుతూ చాలామంది ఓటర్లను కలువగా, సీఎం కేసీఆర్‌పై ప్రజల్లో ఉన్న అభిమానం ప్రత్యేకంగా చూశామన్నారు.టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ఏదో ఒక రూపంలో ప్రతి ఇంటికీ అందుతుండటంతో ప్రజల్లో మంచి స్పందన ఉంద న్నారు.అంతేకాకుండా వామ పక్ష పార్టీలు సీపీఐ(ఎం), సీపీఐ మద్దతుతో టీఆర్ ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలువడం ఖాయ మని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి కాట్రొత బహదూర్, నాయకులు పల్లె జంగా రెడ్డి,కసరమొని మహేందర్, నిఖిల్ గౌడ్ తదితరులు ఉన్నారు.