Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు లింగస్వామి
- అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రమాదకరంగా వైర్లు
- విద్యుత్ డివిజన్ అధికారికి సీపీఐ(ఎం) వినతి
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
దండుమైలారం గ్రామంలో కిందకు వేలాడుతున్న విద్యుత్ వైర్లను సరి చేయాలని సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు మీసాల లింగస్వామి డిమాండ్ చేశారు. ఈ మేరకు డివిజన్ విద్యుత్ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో విద్యుత్ వైర్లు వ్యవసాయ బావులు, ఇండ్ల మధ్య కిందకు వేలాడుతున్నాయని చెప్పారు. ప్రజలకు ప్రమాదకరంగా మారాయని ఆందోళన వెలిబుచ్చారు. అదే విధంగా అంబేద్కర్ విగ్రహం వద్ద జయంతి, వర్థంతులను నిర్వహిస్తున్న సందర్భంగా ఆ మహనీయునికి పూలదండలు వేసే క్రమంలో విద్యుత్ వైర్లు చేయికి అందే విధంగా వేలాడుతున్నాయన్నారు. ప్రమాదకరంగా ఉన్నాయని తెలిపారు. కిందకు వేలాడుతున్న విద్యుత్ వైర్లను సరి చేయాలని గతంలో అనేక సార్లు విద్యుత్ అధికారులతో మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారుల స్పందించి వైర్లను సరి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు గుడేటి జంగయ్య, నాయకులు తింక యాదగిరి, కాకి రమేష్, సంజీవ ఉన్నారు.