Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ మయమైన శేరిలింగంపల్లి నియోజకవర్గం
- అన్ని తామై చూస్తున్న జెరిపేటి జయపాల్
- వేలలో తరలిరానున్న కాంగ్రెస్ శ్రేణులు
- కళాకారులతో ప్రత్యేక కార్యక్రమాలు
- రోడ్డు వెంబడి బ్యానర్లు, జెండాల ఏర్పాటు
నవతెలంగాణ-చందానగర్
కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురా వాలని సంకల్పంతో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర నేడు శేరిలింగంపల్లి నియోజకవర్గంలోకి చేరుకోనుంది. ఈ సందర్భంగా చందానగర్‌కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు, జోడో యాత్ర మొబలై జేషన్ కమిటీ మెంబర్ జయపాల్, ప్రచార కమిటీ మెం బర్, నాయకుడు జెరిపేటి రాజులు అన్ని ఏర్పాట్లను దగ్గ రుండి చూసుకుంటున్నారు. మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి మొదలుకొని భెల్ చౌరస్తా వరకు జాతీయ రోడ్డుకు ఇరువైపులా కాంగ్రెస్ జెండాలు, బ్యానర్లతో మొత్తం కాంగ్రెస్ మయం చేశారు. సీనియర్ నాయకులు జయపాల్ ఆధ్వర్యంలో 15 వేల మంది నాయకులు, కార్యకర్తలు, వెయ్యి మంది మహిళా కార్యకర్తలు, అన్ని డివిజన్ల కార్పొరేటర్లు ఒక్కొక్కరు వెయ్యి మంది చొప్పున మొత్తం 10 వేల మందిని గ్యాదర్ చేస్తున్నారు. వెయ్యిమంది మహిళలతో జాతీయ జెండాలతో స్వాగతం పలకనున్నారు. భరత్‌గౌడ్ ఆధ్వర్యంలో 100 మంది కళాకారులతో కళారూపాలతో ర్యాలీలో ఆటపాటలు ఉంటాయి. నాయకులు, కార్యకర్తలకు భోజనాలు ఏర్పాటు, విఐపిలకు ప్రత్యేక వసతి కల్పించారు. రాహుల్ యాత్రకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. తెలంగాణలో యాత్ర మొదలు నుంచి ఇప్పటి వరకు రాహుల్ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో కూడా రాహుల్ జోడో యాత్రతో జోష్ వచ్చింది.