Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
దోపిడీ లేని సమాజ నిర్మాణం కోసం ఏఐటీయూసీ ఉద్యమిస్తుందని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఓరుగంటి యాదయ్య అన్నారు. ఇబ్రహీంపట్నం మండల ఏఐటీయూసీ 3వ మండల మహాసభకు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జెండా ఆవిష్క రించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఏఐటీయూసీ ఆవిర్బ వించి 102 సంవత్సరాలు పూర్తి చేసుకున్నదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు కార్మిక హక్కులను కాలరాస్తున్నాయన్నారు. కార్మికులు ఐక్య పోరాటాల ద్వారానే కార్మికుల సమస్యలు పరిష్కరించబడుతాయన్నారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలను లేబర్ కోడ్లుగా మార్చడం ద్వారా యాజమాన్యల దోపిడీ తీవ్రమైందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మిక హక్కుల కోసం ఏఐటీయూసీ నిరంతరం పోరాడుతుంద న్నారు. సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు కావలి నర్సింహా మాట్లాడుతూ.. కార్మి క హక్కుల కోసం కార్మికులను ఐక్యం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి పూల యాదయ్య, చంద్రకళ, శివరాల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
నూతన కమిటీ ఎన్నిక...
ఏఐటీయూసీ నూతన మండల కమిటీ ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షు లుగా ఎండి అలీమొద్దిన్, అధ్యక్షులుగా పంది శ్యామేలు, ఉపా ధ్యక్షులుగా శివరాల అశోక్, ఎల్. అ నంతరెడ్డి, ప్రధాన కార్యదర్శి సీహెచ్ విజరు కుమార్, సహాయ కార్యదర్శు లుగా కృష్ణమూర్తి, షేకరాతో పాటు మరో 13 మంది కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు.