Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నివాళి అర్పించిన నాయకులు
- అంతిమయాత్రలో పాల్గొన్న సీపీఐ(ఎం) నాయకులు, యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి, వాయిస్ ఆఫ్ తెలంగాణ టీచర్ పత్రిక ప్రధాన సంపదకులు మాణిక్ రెడ్డి
నవతెలంగాణ-కొడంగల్
ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) జిల్లా ప్రధాన కార్యదర్శి బందెప్ప (43) సోమవారం హైదరాబా ద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆదివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో యూ టీఎఫ్ సమావేశం ముగించుకుని తన స్వగ్రామానికి సం ఘం నేత నాణ్యనాయక్తో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఆగి ఉన్న లారీని ఢకొీనడంతో నాణ్యనాయక్ అక్కడి కక్కడే మృతిచెందారు. తీవ్ర గాయాలైన బందెప్పను హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి బందెప్ప సోమ వారం సాయంత్రం మరణించారు. ఆయనకు భార్య మౌని క, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి జంగయ్య, చావ రవి, వాయిస్ ఆఫ్ తెలంగాణ టీచర్ పత్రిక ప్రధాన సంపాదకులు పాపన్నగారి మాణిక్ రెడ్డి, సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షులు వెంకటరత్నంలు యశోద ఆస్పత్రికి వెళ్లి సోమవారం కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన భౌతిక కాయాన్ని తన స్వగ్రామమైన దౌల్తాబాద్‌కు తరలించారు. చావ రవి, మాణిక్ రెడ్డి, వెంకటరత్నంలు బందెెప్ప భౌతికకాయంపై టీఎస్ యూటీఎఫ్ జెండాను కప్పి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంత్యక్రియలో వారు పాల్గొని, పాడే మోస్తు జోహార్ బందెప్ప, సాధిస్తాం మీ ఆశయలను అంటూ నినాదాలు చేశారు.
ఐక్య ఉద్యమాలలో క్రియాశీలక పాత్ర
ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం ఐక్య ఉద్య మాలు నిర్మించడంలో బందెప్ప క్రియాశీలక పాత్ర పోషించారు. యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్య తలు నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయులను ఉద్యమాల్లోకి కదిలించడంలో ఆయనకంటూ ప్రత్యేక స్థానం ఉంది. విద్యారంగ సమస్యలను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడంలో ఆయనది ప్రత్యేక శైలి.
పలువురి నివాళి
టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చావరవి, వాయిస్ ఆఫ్ తెలంగాణ టీచర్ పత్రిక ప్రధాన సంపాద కులు మాణిక్ రెడ్డి, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లేశం, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి మహిపాల్, మాజీ జడ్పీటీసీ మోహన్‌రెడ్డి, వైస్ ఎంపీపీ మహిపాల్‌రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నరోత్తంరెడ్డి, సర్పంచ్ శిరీష రమేష్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బుస చంద్రయ్య, కౌన్సిలర్ మధుసూదన్‌యాదవ్, పీఆర్టీయూ, ఎస్టీయూ నాయకు లు, ఎంఈఓలు, ఉపాధ్యాయులు, తదితరులు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించి, అంతిమయాత్రలో పాల్గొన్నారు.
ఉపాధ్యాయ రంగానికి తీరని లోటు : టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి
ఉపాధ్యాయ ఉద్యమ నేత బందెప్ప మరణం పట్ల టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ సంతాపం ప్రకటించింది. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి చివరి వరకు ఆయన చురుకుగా పని చేశారని గుర్తు చేశారు. ఆయన మరణం ఉపాధ్యాయ రంగానికి తీరనిలోటని పేర్కొన్నారు.
విద్యారంగ పరిరక్షణకు ఎంతో కృషి : వాయిస్ ఆఫ్ తెలంగాణ టీచర్ పత్రిక ప్రధాన సంపాదకులు మాణిక్ రెడ్డి
టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బందెప్ప మరణించాలని వార్త తెలియడంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యామన్నారు. ఉపాధ్యాయ, విద్యారంగ ఉద్యమానికి తీరని లోటు అన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సాను భూతి ప్రకటించారు. ఉపాధ్యాయ ఉద్యమంలో అనేక ఉద్యమాలు చేశారన్నారు.
బందెప్ప మరణం బాధాకరం : యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు వెంకటరత్నం
బందెప్ప మరణించడం చాలా బాధాకరమన్నారు. వికారాబాద్ జిల్లా ఏర్పాటు తర్వాత యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సమస్యల కోసం అనేక పోరాటాలు బందెప్పతో కలిసి పని చేశామన్నారు. ఆయన లేని లోటు ఉపాధ్యాయ రంగానికి తీరని లోటు అన్నారు. ఉపాధ్యాయ సమస్యల కోసం ఉపాధ్యాయులను కదిలించడంలో, సమస్యపై స్పందించడంలో ఆయన ముందుండే వారన్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సహనంతో ఉండేవారన్నారు. ఇలాంటి వ్యక్తి మన ముందు లేకపోవడం బాధాకరమన్నారు.
సామాజిక ఉద్యమాలకు తీరనిలోటు : సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లేష్
బందెప్ప మరణం సామాజిక ఉద్యమాలకు తీరనిలోట ని ఆయన అకాల మరణం చాలా బాధించిందన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తామన్నారు. సాధారణ కుటుంబంలో పుట్టి ఉన్నత స్థాయికి ఎదిగిన నేత అని కొనియాడారు. ఉపాధ్యాయ ఉద్యమంలోనూ ప్రజాతంత్ర ఉద్యమాల్లోనూ ఆయన కంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని పేర్కొన్నారు.
ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం బాధాకరం : కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి మహిపాల్
యూటీఎఫ్ సమావేశం ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం బాధాకర మన్నారు. బందెప్ప మరణించారని వార్త తెలియడంతో తీ వ్ర దిగ్భ్రాంతికి గురయ్యామన్నారు. ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించేందుకు అనేక పోరాటాలు చేశారన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.