Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఎల్పీవో శంకర్‌నాయక్
నవతెలంగాణ-బషీరాబాద్
శానిటేషన్, ప్లాంటేషన్ పనులను పకడ్బందీగా అమలు చేయాలని డీఎల్పీవో శంకర్ నాయక్ అన్నారు బుధవారం మంతటి గ్రామపంచాయతీలో శానిటేషన్, ప్లాంటేషన్ పనులను పరిశీలించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో వివిధ గ్రామ పంచాయతీల కార్యదర్శులతో నిర్వహించిన సమా వేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలోని, కార్యదర్శులు శానిటేషన్ చేయించి, నాటిన మొక్కలను రక్షించాలన్నారు. ప్రతి ఒక్క గ్రామపంచాయతీలో శానిటేషన్ పనులను పకడ్బం దీగా పనులను అమలు చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రమేష్, మంతట్టి గ్రామ సర్పంచ్ దశరథ్, వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.