Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మిల్లు నుంచి వచ్చే దుమ్ము, ధూళితో పత్తి పంట నాశనం
- నిబంధనలు ఉల్లంఘిస్తున్న నెల్లూరు యజమానులు
- ఫిర్యాదు చేసినా ఎవరు పట్టించుకోని వైనం
నవతెలంగాణ-యాచారం
మండల పరిధిలోని యాచారం కేంద్రంలో ఉన్న శేషాద్రి రైస్ మిల్లు, బ్రాయిలర్ మిల్లు యజమానుల నిర్వాకంతో చుట్టుపక్కల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బుధవారం ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గ్రామంలోని 215, 216, 217, 218 సర్వే నెంబర్ల భూములు ఈ రైస్ మిల్లు చుట్టూ ఉన్నాయని అన్నారు. ఈ రైస్ మిల్లు చుట్టూ ప్రహరీ, సరియైన జాగ్రత్తలు తీసుకోకుండా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. దీంతో మిల్లు నుంచి వచ్చే దుమ్ము, ధూళి, పొగ, చెత్తాచెదారం చుట్టూ ఉన్న పొలంలోకి విపరీతంగా వచ్చి పడి పంటలను నాశనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమకున్న పొలాల్లో పత్తి పంటను పండిస్తున్నామనీ,ఈ మిల్లు నుంచి వచ్చే దుమ్ము, దూళిపై సంబంధిత అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్న పొలాల్లో పంటలు కూడా పూర్తిగా దెబ్బ తింటున్నాయని చెప్పారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి అందకుండా పోతుందని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.