Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ చేవెళ్ల డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు బేగరు అరుణ్ కుమార్, శ్రీనివాస్
నవతెలంగాణ-శంకర్పల్లి
చేవెళ్ల నియోజకవర్గంలోని బస్సుల సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ చేవెళ్ల డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు బేగరు అరుణ్ కుమార్, శ్రీనివాస్ అన్నారు. బుధవారం చేవెళ్ల నియోజకవర్గంలో వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులను బస్సులకు సంబం ధించిన సమస్యలపై వివరాలు అడిగి తెలుసు కున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేవెళ్ల డివిజన్లో బస్సుల సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయనీ, వాటికి వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. చేవెళ్ళ శంకర్పల్లి మండలంలో కొన్ని వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారనీ వారి సమయానికి అనుగుణంగా బస్సులు రాక పోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారని తెలి పారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో పేద విద్యార్థులను చదువుకు దూరం చేసే కుట్ర జరుగుతుందని, దానిని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో తిప్ప కొడతామన్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు స్పందించి విద్యార్థుల కళాశాల, పాఠశాల సమ యానికి అనుకూలంగా బస్సులు నడపాలని కోరారు. లేనియేడల వేలాది మంది విద్యార్థులతో ఎస్ఎఫ్ఐ ఆధ్యర్యంలో రహదారుల దిగ్బంధం చేస్తామని హెచ్చంచారు.
అనంతరం ఎస్ఎఫ్ఐ శంకర్పల్లి మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ కమిటీలో వివిధ కాలేజీ వాసని కాలేజీ అధ్యక్షులు కార్యదర్శి నవీన్, రాహుల్ గర్ల్స్ కర్డ్వేనర్ భాగ్యలక్ష్మి ,సప్న ఏక గ్రీవంగా ఎన్నికయ్యారు. జాగృతి డిగ్రీ కాలేజ్ కమిటీ అధ్యక్షులు, కార్యదర్శి ప్రేమ్ సాయి, సాయి హరిగర్ల్స్ కన్వీనర్ లావణ్య, ప్రవళిక, ప్రత్యూష, వివేకానంద కాలేజీ అధ్యక్షులు,కార్యదర్శి శివ, మధు గర్ల్స్ స్వాతి,పద్మ ప్రియా, ఎస్ఎఫ్ఐ నాయకులు రాజేందర్, శ్రీకాంత్, విద్యార్థులు ఉన్నారు.