Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అడిషనల్ కలెక్టర్ ప్రతీక్ జైన్,జిల్లా విద్యాధికారి సుశింధర్రావు
నవతెలంగాణ-శంకర్పల్లి
ప్రతి విద్యార్థి చదవడం, రాయడం, గణిత ప్రక్రియలో నైపుణ్యం సాధించాలని అడిషనల్ కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు.ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసి (ఎఫ్ ఎల్ ఎన్) ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యా భావన కార్యక్రమం శంకర్పల్లి మండలంలోని జనవాడ, మిర్జాగూడ, బుల్కాపూర్ పాఠశాలలను అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ , జిల్లా విద్యాధికారి సుశింధర్రావు తో కలిసి బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. తెలుగు,ఇంగ్లీష్,గణితంలో ఎంతవరకు విద్యార్థులు బేసిక్స్ నేర్చుకున్నారని పాఠశాలలకు వెళ్లి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులందరూ కూడా తప్పనిసరిగా పాఠ్య పథకము, బోధనో పకరణాలు ఉపయోగించి పాఠాలు బోధించాలని సూచించారు. ప్రతి విద్యార్థి చదవడం, రాయడం, గణిత ప్రక్రియల్లో నైపుణ్యం సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అకాడ మిక్ మానిటరింగ్ అధికారి వెంకటేష్ , ఎంపీడీవో వెంకయ్య, మండల విద్యాధికారి అక్బర్, మండల నోడల్ అధికారి నరహరి, రంగారెడ్డి జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు రవీందర్ గౌడ్, జనవాడ సర్పంచ్ లలితా నరసింహా, ఎంపీటీసీ నాగేందర్ పాల్గొన్నారు.