Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మైనార్టీ సంక్షేమ శాఖ జిల్లా అధికారిని సుధారాణి
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
కేంద్ర ప్రభుత్వ ప్రీ,పోస్ట్ మెట్రిక్, మెరిట్ కంమీల్స్ ఉపకార వేతనాలు రిజిస్ట్రేషన్, వెరిఫికేషన్ గడువు పెంచడం జరిగిందని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిని సుధారాణి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ మైనారిటీ సంక్షేమ శాఖ ద్వారా అమలు చేయనున్న ఈ పథకంలో 2022-23 విద్యా సంవత్సరమునకు మైనారిటీ విద్యార్థిని, విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రీ, మెట్రిక్, బేగం హజరత్ మహల్ నేషనల్ స్కాలర్ షిప్ కోసం విద్యార్ధులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ నవంబర్,15 వరకు గడువు పెంచినట్టు తెలిపారు. స్కూల్(ఇన్) లెవల్ వెరిఫికేషన్ చివరి తేదీ నవంబర్,30వ తేదీన (ణవీఔఉ (ణచీఉ) లెవల్ వెరిఫికేషన్ చివరి తేదీ డిసెంబర్,15 వరకు గడువు పెంచినట్టు పేర్కొన్నారు. పోస్ట్ మెట్రిక్, మెరిట్ కం మీల్స్ మెట్రిక్ కోసం విద్యార్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు నవంబర్,30వ తేదీ వరకు గడువు పెంచినట్టు తెలిపారు.కాలేజీ (ఐఎన్వో) లెవల్ వెరిఫికేషన్ చివరి తేదీ డిసెంబర్,15 (ణవీఔఉ (ణచీఉ) లెవల్ వెరిఫికేషన్ కోసం చివరి తేదీ డిసెంబర్ 31వరకు ఉంటుందని తెలిపారు.
జిల్లాలోని అన్ని ప్రభుత్వ,ప్రయివేట్ (ప్రభుత్వ ఆమోదిత) విద్యా సంస్థల నిర్వాహకులు, స్కాలర్ షిప్ దరఖాస్తు చివరి తేది వరకు పొడిగింపు విషయంలో మైనారిటీ విద్యార్థినీ,విద్యార్థులకు సరైన అవగాహన కల్పించాలని సూచించారు. అర్హులైన మైనారిటీ విద్యార్థిని విద్యార్థులందరూ (కేంద్ర ప్రభుత్వ) ప్రీ, మెట్రిక్/బేగం హజరత్ మహల్/ పోస్ట్ మెట్రిక్, మెరిట్ కం మీల్స్ స్కాలర్ షిప్ దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. తదుపరి విద్యార్థిని,విద్యార్థులు అందజేసిన ఆన్ లైన్ దరఖాస్తులను పూర్తిగా పరిశీలించి (స్టూడెంట్ ఆధార్ కార్డు, ఫొటో, స్టడీ, బోనఫైడ్, ఫ్రోగ్రెస్కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు) పూర్తి సర్టిఫికెట్లలో జత చేసి, అర్హత ఉన్న దరఖాస్తులను తమకు కేటా యించిన లాగిన్ ద్వారా దరఖాస్తులు షెడ్యూల్డ్ చివరి తేదీ లోగా పరిశీలించి ఆన్ లైన్ ద్వారా జిల్లా నోడల్ ఆఫీసర్ వెరిఫై చేసి, ఫార్వర్డ్ చేయనున్నట్టు తెలిపారు. షెడ్యూల్డ్ చివరి తేదీ లోగా పరిశీలించిన దరఖాస్తులకు పూర్తి బాధ్యత ఆయా పాఠశాల,కళాశాలల యాజమాన్యం నిర్వహించాలని పేర్కొన్నారు.