Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతుల ఆందోళన
నవతెలంగాణ-మర్పల్లి
70 ఏండ్లుగా మా తండ్రుల కాలం నుంచి సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న భూమిని ఇతరుల పేరు మీద ఎలా పట్టా చేస్తారు అని మండలంలోని గుండ్ల మర్పల్లి గ్రామ రైతులు బుధవారం తహసీల్దార్ కార్యాల యం ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. గుండ్ల మర్పల్లి గ్రామంలోని 54,6%శీ%, సర్వే నంబర్లోని 32 ఎకరాల భూమి అదే గ్రామానికి చెందిన ఏడుగురు రైతులు సుమారు 70 సంవత్సరాలుగా సాగు చేసుకుని జీవనం కొనసాగిస్తున్నామని గత ప్రభుత్వాలు పట్టా పాస్ బుక్కులు కూడా మాకు ఇచ్చారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వారికి తెలియకుండా ఈ భూమి హైదరాబాద్ నగరానికి చెందిన ఎండి గౌసుద్దీన్, ఖాదర్ మోహియోద్దీన్, మహ మ్మద్ రహీంమొద్దీన్ల పేరు మీద ఎలా పట్టా చేస్తారు అని వారన్నారు. ఈ భూమి మాకు దక్కకపోతే మా కుటుంబాల బ్రతుకుతెరువు ప్రశ్నార్థకంగా మారుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వారు సాగు చేసుకుంటున్న భూమి ని అధికారులు వారికే దక్కేలా చూడాలని వారు వేడుకు న్నారు. కోర్టు ఆదేశానుసారం భూమిని పట్టా చేశారని కబ్జా లో ఉన్న రైతులు సరైన ఆధారాలు చూపితే బదలాయింపు నిలుపుదల చేస్తామని తహాసీల్దార్ శ్రీధర్ తెలిపారు.