Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజేంద్రనగర్ నియోజకవర్గం ఇన్చార్జి జ్ఞానేశ్వర్ ముదిరాజ్
నవతెలంగాణ-శంషాబాద్
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేప ట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నామని రా జేంద్రనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి బొర్ర జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అన్నారు. బుధవారం ఆయన శంషా బాద్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ దేశ సమైక్యత, సమగ్రత కోసం , దేశం లో విచ్చిన్నకర శక్తుల ఆగడాలను నిలువరించి సుపరిపాలన అందించాలన్న లక్ష్యంతో భారత్ జోడో యాత్ర చేపట్టా రన్నారు. ఈ నెల 1,2తేదీ రెండు రోజుల పాటు రాజేం ద్రనగర్ నియోజకవర్గంలో రాహుల్ గాంధీ పాద యాత్ర దిగ్విజయంగా కొనసాగిందన్నారు. వేలాది మంది అభిమా నులు, కార్యకర్తలు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవం తం చేసి కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపారని తెలిపారు. రాహుల్ గాంధీ పాదయాత్రతో కాంగ్రెస్ కార్య కర్తల్లో ప్రజల్లో ఒక విశ్వాసం నమ్మకం ఏర్పడ్డాయన్నారు. ఇది భవిష్యత్తులో కాంగ్రెస్ రాష్ట్రంలో దేశంలో అధికా రంలోకి రావడానికి ఎంతో దోహదం చేస్తుందని తెలిపారు. జాతీయ రహదారి 44 గుండా రెండు రోజుల పాటు సాగిన రాహుల్ పాదయాత్రకు సహకారం అందించిన కాంగ్రెస్ కార్యకర్తలు , నాయకులు, పోలీసులు, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, మీడియా మిత్రులకు, మహిళలు, రైతులు, యువతకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామ న్నారు. కార్యక్రమంలో టిపిసిసి ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు జల్ పల్లి నరేందర్ గారు డిస్టిక్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి మైలారం సులోచన, బి బ్లాక్ డివిజన్ అద్యక్షులు ఖలేద్, శంషాబాద్ మున్సిపల్ పట్టణ అధ్యక్షులు సంజరు యా దవ్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు గడ్డం శేఖర్ యా దవ్, డివిజన్ అధ్యక్షులు బాలరాజ్, మైలార్దేవపల్లి డివిజన్ అధ్యక్షులు ధనుంజయ నజీర్ బారు శంషాబాద్ మం డల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కోటేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి మహేందర్ ముదిరాజ్, మున్సిపల్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు జాంగిర్ పాషా, మాజీ ఉపసర్పంచ్ శంశోద్దీన్, ఫక్రుద్దీన్, సతీష్ , జక్కు భాయ్, కుమార్, పోరని ప్రవీణ్ , కోరని సదానంద్, సత్తయ్య, చందు యాదవ్, రాకేష్ పాల్గొన్నారు.