Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ కుమార్
నవతెలంగాణ-పరిగి
పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని పరిగి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ కుమార్ అన్నా రు. బుధవారం పరిగి పట్టణ కేంద్రంలోని ప్రాథమిక బాలి కల పాఠశాలలో పరిగి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ కుమార్ పర్యటించారు. 'మన ఊరు మనబడి' ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం ద్వార విడుదలైన నిధులతో చేయా ల్సిన పనుల గురించి అధ్యాపకులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని తెలిపారు. అంతేకా కుండా సీఎం కేసీఆర్ 'మన ఊరు మనబడి' కార్యక్రమం ద్వారా పాఠశాలలో మౌలిక వసతులు, పాఠశాలల అభివృ ద్ధి కోసం ఎంతో కృషి చేశారన్నారు. కార్యక్రమంలో కౌన్సి లర్స్ మునీర్, రవీంద్ర ప్రధానోపాధ్యాయులు కనక చారి, అధ్యాపక బృందం, విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.