Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీపీ అరవిందరావు
నవతెలంగాణ-పరిగి
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందిస్తున్నా మని ఎంపీపీ అరవిందరావు అన్నారు. బుధవారం పరిగి మండల పరిధిలోని మాదారంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను ఎంపీపీ అరవింద్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో నెలకొన్న సమస్యల గురించి అడి గి తెలుసుకున్నారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరి శీలించారు. అనంతరం ప్రాథమిక పాఠశాలలను సంద ర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు ప్రయివేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను సీఎం కేసీఆర్ తీర్చిదిద్దారన్నారు. నిరు పేద విద్యార్థుల కోసం గురుకులాలను స్థాపించి, అనుభవజ్ఞులైన ఉపాధ్యా యులతో విద్యాబోధన కొనసాగుతుందని తెలిపారు. ఒక్కొక్క విద్యార్థిపై లక్షల రూపాయలు వెచ్చించి విద్యనం దిస్తున్నామన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేశారని తెలిపా రు. పాఠశాలలో మౌలిక వసతుల కల్పన కోసం 'మన ఊ రు మనబడి' కార్యక్రమాన్ని తీసుకొచ్చారన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ బోధనలను ప్రవేశపెట్టి, నిరుపేద విద్యార్థులకు ఇంగ్లీష్ విద్యను అందిస్తున్నామన్నారు. పాఠ శాలలో మిషన్ భగీరథ పైప్లైన్ ఏర్పాటు చేయాలని అధికా రులకు సూచించారు. పురాతన భవనాన్ని కూల్చివేసి 'మన ఊరు మనబడి' కార్యక్రమంలో సాంక్షన్ అయిన నూతన భవనాన్ని నిర్మించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీ డీవో శేషగిరి శర్మ, సర్పంచ్ రాములు, నాయకులు విజయ్, ప్రధానోపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.