Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొడంగల్ అంబేద్కర్ చౌరస్తాలో పోస్టర్ ఆవిష్కరణ
నవతెలంగాణ-కొడంగల్
వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నవంబర్ 15న హైదరాబాదులోని రవీంద్రభారతిలో జరిగే గ్రామీణ ఉపాధి హామీ చట్టం-సవాళ్లు అనే అంశంపై జరి గ సెమినార్ను జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. వెంకటయ్య అన్నా రు. కొడంగల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో వ్యవ సాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే సెమి నార్ను జయప్రదం చేయాలని పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి హామీ పథకాన్ని పూ ర్తిగా నిర్వీర్యం చేసి, ఉపాధి హామీ కూలీల కడుపు కొడుత ున్నారన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా రోజు కూలి రూ.600లకు పెంచాలని, 200 పని దినాలు కల్పించాల న్నారు. పని ప్రదేశాలలో కూలీలకు సౌకర్యాలు లేవన్నారు. కొలతలకు సంబంధం లేకుండా కూలి ఇవ్వాలన్నారు. కా ర్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బుస చంద్ర య్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వెం కట్ నరేందర్, కొత్తూరు చంద్రయ్య, దస్తయ్య, జగన్, వెం కటేష్, ధర్మపుర్ అశోక్, సత్తయ్య, కాశప్ప, శకనప్ప, రాము లు తదితరులు పాల్గొన్నారు.