Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కుల్కచర్ల/ చౌడపూర్
మునుగోడులో బీజేపీ శ్రేణులపై టీఆర్ఎస్ నాయ కులు, కార్యకర్తలు దాడి చేయడాన్ని నిరసిస్తూ బుధవారం కుల్కచర్ల మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో బీజేపీ నేతలు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. పలువురు మాట్లాడుతూ.... మునుగోడులో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పై దాడి హేయనీయమన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కరణం ప్రహ్లాద రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఘనపురం వెంకటయ్య గౌడ్, మండలాధ్యక్షుడు గాదె మహిపాల్ ముదిరాజ్, గిరిజన మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ జానకిరామ్ చౌహన్, మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్ర లింగం, జిల్లా దళిత మోర్చ ప్రధాన కార్యదర్శి శ్రీని వాస్, మండల ప్రధాన కార్యదర్శులు సిహెచ్ హనుమంతు, నరసింహారెడ్డి, పరిగి నియో జకవర్గ నాయకులు గణపురం ఆంజనేయు లు, కార్యదర్శి పంతుల శివ, జిల్లా సీనియర్ నాయకులు కాటన్పల్లి ఆంజనేయులు, బొంగు మల్లేష్, వార్డు సభ్యులు గుడాల యాదయ్య, మం డల నాయకులు పాల్గొన్నారు.
చౌడాపూర్ మండల కేంద్రంలో.....
చౌడపూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర బీజేపీ మండల అధ్యక్షుడు బందయ్య ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం చేశారు.ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు,మండల ప్రధాన కార్యదర్శు లు రాజశేఖర్, రామాంజనేయులు,ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు వెంకటేష్, సీనియర్ నాయకుడు జనా ర్ధన్, యువ మోర్చా మండల అధ్యక్షుడు శరత్, పాల్గొన్నారు.