Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిందితులను పట్టించిన బస్సు టికెట్
- వ్యభిచార నేపథ్యంలోనే మహిళా హత్య
- ఇద్దరు నిందితుల అరెస్ట్, బైకు, బంగారు నగలు స్వాధీనం
- వివరాలు వెల్లడించిన ఏసీపీ కుశల్కర్
నవతెలంగాణ-షాద్ నగర్
గుర్తు తెలియని మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. షాద్‌నగర్ ఏసీపీ కార్యాలయంలో కేసుకు సంబంధించిన వివరాలను ఏసీపీ కుషాల్కర్ గురువారం వెల్లడించారు. గత నెల 23వ తేదీన కొందుర్గ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గోనేసంచిలో ఒక మహిళ మృదేహం లభ్యమైంది. గ్రామ వీఆర్వో ఇచ్చినా ఫిర్యాదు మేరకు పోలీ సులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. చనిపోయిన మహిళ షాద్‌నగర్ సమీపంలోని కమ్మదనం గ్రామానికి చెందిన సరితగా గుర్తించారు. సీసీ కెమెరాలు, బస్ టికెట్ల ఆధారంగా నిందితులు కొందుర్గు మండలం గంగన్నగూడా గ్రామానికి చెందిన అమృత, ఆమె స్నేహి తుడు లింగం అని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వీరిని తమ దైన శైలిలో విచారణ చేస్తే అమృత కన్న సరిత వద్దకు ఎక్కువగా కస్టమర్లతో వ్యభిచారం కొనసాగిస్తుందని వ్యభిచార నేపథ్యంలో అసూయతోనే సరితను హత్య చేయించారు. నిందితుల వద్ద నుండి హత్యకు ఉపయోగిం చిన కర్రను, సరితకు సంబందించిన లక్ష నలుబై వేల విలువ గల బంగారం, బైక్ స్వాధీనం చేసుకున్నారు.
అసూయతోనే హత్యకు కుట్ర
తన కన్నా ఎక్కువ డబ్బులు సంపాదిస్తుందని, తన కన్నా బాగుందనే ద్వేషం పెంచుకున్న అమృత షాద్‌నగర్ బస్టాండ్‌లో స్వీపర్‌గా పనిచేస్తున్న లింగంతో కలిసి గంగన్న గూడెంలో అమృత ఇంటివద్ద లింగం ఇరువురు కలిసి సరితను మద్యం తాగించి ఆ తరువాత ఒక కర్రతో ఆమె నెత్తిపై కొట్టారు. రక్తం మడుగులో ఉన్న సరిత ముఖంపై అమృత మెత్తతో ఊపిరి ఆడకుండా దారుణంగా హత్య చేసింది. ఆ తర్వాత శవాన్ని గోనెసంచిలో కట్టి తంగేళ్లపల్లి, చించోడు మధ్య వాగు పక్కన శవాన్ని పడేశారు.
మిస్టరీ కేసుగా నమోదు రంగంలోకి పోలీసులు
మిస్టరీ కేసుగా నమోదు చేసి పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ఏసీపీ కుశాల్కర్ ఆదేశాలతో రూ రల్ సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో రెండు బృందాలను ఏర్పాటు చేశారు. కొందుర్గు ఎస్సై కోన వెంకటేశ్వర్లు, కేశంపేట ఎస్సై ధనుంజయ రెండు బృందాలు కానిస్టేబుల్ శివ తదితరులు కేసులో దర్యాప్తును ప్రారంభించారు. చనిపోయిన మహిళ ఎవరో తెలియదు, ఏలాంటి ఆనవాళ్లు లేవు, పోలీసులు రెండు బందాలుగా విడిపోయి కేసులో అనేక ఆధారాలను చాకచక్యంగా సంపాదించారు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకున్నందుకు ఏసీపీ కుశల్కర్ వారిని అభినందించారు.