Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. వెంకటయ్య
నవతెలంగాణ-వికారాబాద్ ప్రతినిధి
బీజేపీ ప్రభుత్వం చేస్తున్న మతోన్మాదాన్ని అడ్డుకోవాల ని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. వెంకటయ్య సూచించారు. కేవీపీఎస్ వికారాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 'కులం-మతం- మతోన్మాదం' అనే అంశంపై కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు రవి అధ్యక్షతన వికారా బాద్ కార్యాలయంలో శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం లౌకిక వాదాన్ని తూట్లుపొడిచి, బీజేపీ ప్రభుత్వం నేరుగా మతాలను రాజకీయకు మతాన్ని జోడించి వివిధ రాష్ట్రాల్లో రాజ్యధికారం లోనికి రావాలనే ప్రయత్నించడాన్ని తీవ్రంగా ఖండించారు. భిన్న మతాలు భిన్న కులాల్లో ఉన్న టువంటి లౌకిక భారతదేశంలో రాజ్యాంగనికి వ్యతిరేకంగా మతోన్మాద చర్యలకు పాల్పడడం దుర్మార్గం అన్నారు. భార తదేశంలో కుల, మత ఆధారిత రాజకీయాలు చేసి పేదలను కుల, మతాలను సాధనంగా ఉపయోగించుకొని దోపిడీ చేస్తుందని అన్నారు. భారతదేశంలో ఉన్న కులం, మతం పు ట్టుక, మతోన్మాద విధానాలు దేశంలో కల్పిస్తున్న దుష్ప్రభా వాల కార్యకర్తలు అర్థం చేసుకోవాలని, మతోన్మాద చర్యలను అడ్డుకొని మతోన్మాద చర్యల నుంచి ప్రజలను కాపాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కేవీపీస్ జిల్లా కార్యదర్శి ఆర్.మహిపాల్, కేవీపీస్ జిల్లా మండల నాయకులు, విజయ, సురేష్, గోపాల్, శ్రీనివాస్ సుదర్శన్, సురేష్ లక్ష్మయ్య, శ్యాం, అనిల్, కుమార్, యాదయ్య, దిలీప్, వివిధ మండలాల కార్యకర్తలు పాల్గొన్నారు.