Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్యాంకులు నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలి
- జిల్లా అధికారులను ఆదేశించిన జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్‌జైన్
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
బ్యాంకులకు నిర్దేశించిన లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని బ్యాంకర్లకు జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. గురువారం సమీకృత కలెక్టరేట్ సమావేశ మం దిరంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్‌జైన్ అధ్యక్షతన డీసీ సీ, డీఎల్ఆర్సీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు బ్యాంకుల ద్వారా అందించే పంట రుణాలు సకాలంలో అందించి వా రికి చేయూతను అందించాలని బ్యాంకర్లను ఆదేశించారు. అధికారులకు, బ్యాంకులకు నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత వ్యవధిలోగా పూర్తి చేయాలని, ప్రభుత్వ పథకాల అమలు లో లబ్దిదారులకు ఎటువంటి జాప్యం లేకుండా రుణ వితరణ చేయాలని తెలిపారు. బ్యాంకులలో పెండింగ్‌లో ఉన్న, గ్రౌండింగ్ కానీ యూనిట్లను త్వరగా పరిష్కరించేం దుకు చర్యలు చేపట్టాలని సూచించారు. వివిధ సంక్షేమ శాఖలకు చెందిన సబ్సిడీ రిలీజ్ అయిన యూనిట్లకు వెంటనే గ్రౌండింగ్ చేయాలనీ, పీఎం స్వానిధి, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ పథకాలు పూర్తి చేయుటకు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ యన్.శ్రీనివాస రావు, ఆర్.బీ.ఐ అధికారి, నాబార్డు ఎజీఎం శర్మ, డీఆర్డ్డీఎ పీడీ ప్రభాకర్, వ్యవసాయ శాఖ అధికారి గీతారెడ్డి, జిల్లా మైనారిటీ శాఖ అధికారి రత్నాకళ్యాణి, జిల్లా మాత్సశాఖ అధికారి సూకీర్తి, జిల్లా అధికారులు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.