Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆటోను ఢకొట్టిన లారీ
- 5గురు మృతి, 7గురికి గాయాలు మృతులంతా కూలీలే..
- బాధిత కుటంబాలను ఆదుకోవాలని వికారాబాద్‌లో ధర్నా
- మద్దతు తెలిపిన ఆయా పార్టీల నాయకులు
- బాధితులను ఆదుకోవాలని డిమాండ్
వాళ్లంతా రోజు కూలీ పని చేసుకునే పేదలు. రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు. ఆ రోజు కూలీ చేస్తేనే వాళ్లకి రోజు గడిచే పరిస్థితి. రోజువారి లాగానే గురువారం వాళ్లు పని నిమిత్తం వికారాబాద్‌కు ఆటోలో బయలుదేరారు. ధరూర్ మండలం కెరెల్లి వద్దకు రాగానే వారిని లారీ రూపంలో మృత్యువు కబళించింది.
నవతెలంగాణ-వికారాబాద్ ప్రతినిధి
వికారాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢకొీట్టిన ఘటనలో ఐదుగురు మృతిచెందగా, ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ధరూర్ మండలం కెరెల్లి రైతు వేదిక సమీపంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెద్దముల్ మండలం మదనంతాపూర్ తండా, రేగొండికు చెందిన కూలీలు క్రషర్ మీషన్‌లో పనిచేసేందుకు ఆటోలో వికారాబాద్‌కు వెళ్తున్నారు. ధరూర్ మండలం కెరెల్లి రైతు వేదిక వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న లారీ వీరి ఆటోను ఢకొీట్టింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ ఎండి జమీల్40)తో సహా మరో నలుగురు ఎన్.వినోద్(22), వి.రవి నాయక్ (40), హేమ్ల నాయక్(30). ఏం.కిషన్(45) మృతిచెందారు. మరో ఏడుగురు మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన వారిని వికారాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు ఘటన స్థలంలోనే మృతి చెందారు. మిగతా ముగ్గురు మార్గమధ్యలో హాస్పిటల్లో చనిపోయారు. ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకన్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
రోడ్డు ప్రమాదపై మంత్రి
సబితా ఇంద్రారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి
రోడ్డు ప్రమాద ఘటనపై మంత్రి సబితాఇంద్రారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ నిఖిల, ఎస్పీ కోటిరెడ్డితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించా రు. వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే బాదిత కుటుంబాలను ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి పరామర్శించారు. క్షతగ్రాతుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
మృతులు కుటుంబాలకు రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి : మాజీ మంత్రి డాక్టర్ ఏ.చంద్రశేఖర్
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలకు రూ.25లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని మాజీ మంత్రి డాక్టర్ ఏ.చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలను వికారాబాద్ ఏరియా ఆస్పత్రిలో పరామర్శించారు. అంతు కుముందు వికారాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో బాధిత కుటుంబాలతో కలిసి రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పాండుగౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు రాఘవన్ నాయక్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు నవీన్ కుమార్, వికారాబాద్ పట్టణ ఇన్చార్జి శివప్రసాద్, మాజీ కౌన్సిలర్ సురేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్థిక సాయం చేసిన శుభప్రద్ పటేల్
ధారూర్ మండలం బాచారం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం విచారకరం అని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతదేహాల వద్ద నివాళి అర్పించారు. బాధిత కుటుంబాలను ఆర్థిక సాయం చేశారు. ఇలాంటి ఘటనలు తిరిగి జరగకుండా సూచిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.