Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ జిల్లా అధ్యక్షుడు సదానంద రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రహ్లాద రావు
నవతెలంగాణ - కుల్కచర్ల
రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగు తుందని కల్వకుంట్ల కుటుంబ కబంధహస్తాలలో నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగించే దిశగా ప్రతీ కార్యకర్త కృషి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సదానందరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కరణం ప్రహ్లాదరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటయ్యగౌడ్ అన్నారు. గురువారం కుల్కచర్ల మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు గాదె మహి పాల్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామ గ్రామాన బీజేపీని బలోపేతం చేసేందుకు సైనికు డులే కృషి చేయాలన్నారు. అనంతరం మునుగోడులో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పై దాడికి నిరసనగా ప్రధాన చౌరస్తాలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలు సౌమ్య వెంకట్రామిరెడ్డి, బీజేపీ నాయకులు శ్రీనివాస్, చంద్ర లింగం, మోనాచారీ, కృష్ణారెడ్డి, సురేందర్‌గౌడ్, భీమయ్య, వెంకటేష్, శ్రీనివాస్, బిచ్చన్న, ఆంజనేయులు, మల్లేశం, మల్లయ్య, రవీందర్‌రెడ్డి, వెంకటరెడ్డి, రామకృష్ణ, మహేష్, వెంకట్, గోపాల్, గోపాల్, నందునాయక్, నరేష్, రమేష్, కర్ణయ్య, వెంకటయ్య, రాజయ్య, ప్రవీణ్, కటికే నవీన్, పోశయ్య, తదితరులు పాల్గొన్నారు.