Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ మొయినాబాద్ మండల ఉపాధ్యక్షులు గన్నేపాగా నర్సింగ్ రావు
నవతెలంగాణ-మొయినాబాద్
ఏఐసీసీ మాజీ అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు రాహూల్ గాంధీ చేపట్టిన జోడో యాత్రకు అపూర్వ స్పందన వస్తుందనికాంగ్రెస్ మొయినాబాద్ మండల ఉపాధ్యక్షులు గన్నేపాగా నర్సింగ్ రావు తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ కొన్ని దుర్మార్గం శక్తులు దేశాన్ని విభజన చేసి కులాలుగా మతాలుగా విభజించి మనిషి, మనిషిపై మారణ హౌమం సృష్టిస్తున్న మత రాజకీయాలను బొంద పెట్టడానికే జోడో యాత్ర ప్రారంభించారా న్నారు. 2023లో కాంగ్రెస్ కేంద్రంలో, రాష్ట్రంలో అధికారం రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీతోనే అన్ని కులాలకు, మతాలకు, వర్గాలకు న్యాయం జరుగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మండల ఓబీసీ ఉపా ధ్యక్షులు నారాయణపురం మహేందర్‌ముదిరాజ్, కాంగ్రెస్ మండల సీనియర్ నాయకులు అల్లం మాణిక్యంరెడ్డి తలారి, భిక్షపతి ముదిరాజ్, శేఖర్‌రెడ్డి, చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.