Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేశంపేట
మండల పరిధిలోని చౌలపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో కంప్యూటర్ ఏర్పాటు చేయడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ సర్పంచ్ గూడ వీరేశం, పాలకవర్గం ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ నిధులతో ఏర్పాటు చేసినా కంప్యూటర్ను ఇన్చార్జి ఎంపీడీవో రవి చంద్రకుమార్రెడ్డి గురువారం ప్రారంభిం చారు. ఈ సందర్భంగా సర్పంచ్ గూడ వీరేశం మాట్లాడు తూ కంప్యూటర్తోపాటు ప్రింటర్, స్కానర్లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. వీటి ద్వారా డెత్, బర్త్లను మోదు చేయడానికి సులువుగా ఉంటుందని అన్నారు. గ్రామపం చాయతీ టాక్సీ డిమాండ్లను నోటీసులను తీయడానికి కూడా వీలుగా ఉంటుందని తెలిపారు. గ్రామ పంచాయతీ తోపాటు, ప్రజలకు కంప్యూటర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నర్సమ్మ, ఎంపీఓ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి వెంకటేష్, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.