Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐక్యత ఫౌండేషన్ చైర్మెన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి
- మార్కాండేయ ఆలయాన్ని సందర్శించిన సుంకిరెడ్డి
- కమిటీ హాల్ నిర్మాణానికి విరాళంగా రూ.10 లక్షలు
నవతెలంగాణ-ఆమనగల్
ఆలయాలు ప్రశాంతతకు నిలయాలని ఐక్యత ఫౌండేషన్ చైర్మెన్ సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి అన్నారు. పద్మశాలి సంఘం నాయకుల ఆహ్వానం మేరకు గురువారం ఆమనగల్ పట్టణంలోని భక్త మార్కండేయ స్వామి దేవాలయాన్ని ఐక్యత ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సుంకిరెడ్డి వరప్రసాద్‌రెడ్డితో కలిసి ఫౌండేషన్ చైర్మెన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు ఆలయ కమిటీ సభ్యులు సుంకిరెడ్డిని పూర్ణ కుంభంతో ఆలయంలోకి స్వాగతం పలికి పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఐక్యత ఫౌండే షన్ చైర్మెన్ సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి మాట్లాడుతూ నిత్యం క్రమం తప్పకుండా ఆలయాలకు వెళ్లే అలవాటు చేసుకోవడం ద్వారా సంస్కారం, సంప్రదాయాలతో పాటు సన్మార్గంలో నడిపించడానికి దోహదపడుతుందని అన్నా రు. అందుకోసం ప్రతి ఒక్కరూ సమీపంలో ఉన్న ఆలయా లకు క్రమం తప్పకుండా వెళ్ళడం ఆలవాటుగా చేసుకో వాలని సూచించారు. దేవాలయ కమిటీ సభ్యుల విన్నపం మేరకు ఆలయం ఆవరణలో కమిటీ హాల్ నిర్మాణానికి తనవంతు విరాళంగా రూ.10 లక్షలు అందజేస్తానని సుం కిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పద్మ శాలి సంఘం అధ్యక్షులు ఎంగలి బాలకృష్ణయ్య, మున్సిపల్ వైస్ చైర్మెన్ భీమనపల్లి దుర్గయ్య, మహిళా అధ్యక్షురాలు అప్పం అలివేలు, యువజన అధ్యక్షులు మామిడి శెట్టి రవి, సంఘం సీనియర్ నాయకులు గుర్రం భద్రయ్య, సంఘం నాయకులు, ఐక్యత ఫౌండేషన్ సభ్యులు రచ్చ శ్రీరాములు, గన్నోజు సత్యం, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.