Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- శంషాబాద్
మండల పరిధిలోని చిన్న గోల్కొండ నర్సింహ చెరువు కట్టపై వెళ్తున్న బస్సుకు గురువారం తృటిలో ప్రమాదం తప్పింది. పెద్ద గోల్కొండ ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్-15 దగ్గర చిన్న గోల్కొండ నరసింహ చెరువు వరద నీటితో పూర్తిగా నిండిపోయింది. నెల రోజులుగా ఔటర్ ఎగ్జిట్ పూర్తిగా మూసుకుపోవడంతో ప్రయాణ రాకపోకలకు సంబంధించి అధికారులు ఏ రకమైన ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోలేదు. దీంతో గత్యంతరం లేక వాహనదారులు చిన్న గోల్కొండ నరసింహ చెరువు కట్టపై నుంచి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే చిన్నారులను తీసుకువెళ్తున్న బస్సు ప్రమాదవశా త్తు కట్టపైన ఒక పక్కకు ఒరిగింది. దీంతో అందులో ప్రయా ణిస్తున్న వాళ్లు భయాందోళనకు గురయ్యారు. రహదారి నీళ్ల తో నిండి నెలరోజులు అవుతున్న అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో సుమారు 60 గ్రామాలకు చెందిన ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు రహదారి పునరు ద్ధరణ, ప్రస్తుతం వెళ్తున్న రహదారిపై ప్రమాదాలు జరగకుండా కోసం తక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.