Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్వయం సహాయక సంఘాలకు బ్యాంకుల ద్వారా రూ.14 కోట్ల నిధులు మంజూరు
- 2 వేల 500 వందల మందికి ప్రయోజనం
- మహిళా సంఘాల సభ్యులు బ్యాంకు రుణాలను సద్వినియోగం చేసుకోవాలి
- వికారాబాద్ జిల్లా మెప్మా పీడీ రవికుమార్
నవతెలంగాణ-తాండూరు
స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళల్లో ఆర్థిక అభివృద్ధి చేకూరడం జరుగుతుందని వికారాబాద్ జిల్లా మెప్మా పీడీ రవికుమార్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆత్మ నిర్బార్ నిధి పథకం పట్టణ ప్రాంతాల్లో చిరు వ్యాపారులను ఆదుకుంటుందని తెలిపారు. గురువారం ఆయన తాండ్ర పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో నవతెలంగాణ ప్రతినిధితో మాట్లాడుతూ.. స్వయం సంఘాల ద్వారా పట్టణ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. వికారాబాద్ జిల్లాలో పట్టణ ప్రాంతాల్లో 8610 మందిని చిరు వ్యాపారులకు గుర్తించినట్టు తెలిపారు. అందులో మొదట విడతగా 6724 మందికి లోన్లు ఇచ్చామన్నారు. రెండో విడతలో 4000 మందిలో 2000 మందికి రెండవ విడత లోన్లు ఇచ్చామని తెలిపారు. జిల్లాలో 2,443 మహిళా స్వయం సహాయక సంఘాలు ఉన్నాయన్నారు. అందులో 24629 మంది మహిళా సభ్యులు ఉన్నారన్నారు. జిల్లాలో మహిళా సంఘాల సభ్యులకు 19 కోట్ల 50 లక్షల రూపా యలు లోన్లు ఇచ్చేందుకు ప్రణాళికలు తయారు చేయడం జరిగింది అన్నారు. అందులో 14 కోట్ల రూపాయల లోన్లను ఇవ్వడం జరిగిందన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఉంటున్న 2500 మంది మహిళా సంఘాల ప్రయోజనం చేకూరిందన్నారు. తాండూర్ పట్టణ కేంద్రంలో స్టేట్ వండర్స్ లోన్లను 2,826 మందికి లోన్లు ఇచ్చేందుకు గు ర్తించామన్నారు. అందులో 2,729 మందికి మొదటి విడ తగా లోన్లు పదివేల రూపాయలు ఇవ్వడం జరిగిం దన్నారు. వీరందరికీ ఇన్సూరెన్స్ సదుపాయం ఉంద న్నారు. అదేవిధంగా డిజిటల్ పేమెంట్ చేసిన వారికి క్యాష్ బ్యాక్ ద్వారా ప్రయోజనం చేకూరుతుందన్నారు. మున్సి పల్ కేంద్రంలో ఉన్న 200 సంఘాలకు ఏడు కోట్ల రూపా యలు రుణాలు ఇచ్చేందుకు ప్రణాళికల సిద్ధం చేయగా అందులో ఆరు కోట్ల రూపాయల 2000 మంది మహిళల కు ఇచ్చినట్టు తెలిపారు. అదేవిధంగా శ్రీనిధి రుణాలు కూడా ఇస్తామన్నారు. తాండూర్ పట్టణ కేంద్రంలో ఉన్న 70 సంఘాలకు మూడు కోట్ల రూపాయల శ్రీనిధి లోన్లు ఇచ్చామన్నారు. తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించడం ద్వారా వడ్డీ లేని రుణాలు వర్తిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని స్వయం సహాయక సంఘాల సభ్యులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.