Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేటర్ మంజుల రఘునాథ్‌రెడ్డి
నవతెలంగాణ-చందానగర్
కాలనీలో నిర్మిస్తున్న సివరేజ్ ట్యాంక్ ఔట్ లేట్తో కాలనీవాసుల ఇబ్బందులు తొలగనున్నట్టు చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి హామీనిచ్చారు. చందానగర్ డివిజన్ పరిధిలోని శంకర్‌నగర్ కాలనీలో జీహెచ్ యూఎంసీ,సీవరేజ్ బోర్డు, రెవెన్యూ అధికారులతో చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘు నాథ్ రెడ్డి, కాలనీ వాసులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. కాలనీలో సివరేజ్ ట్యాంక్ ఔట్ లేట్ నిర్మాణంపై కాలనీవాసులు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. కాలనీలో నిర్మిస్తున్న సివరేజ్ ట్యాంక్ ఔట్ లేట్ వలన ఎటువంటి నష్టం ఉండదన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పనకు అభివృద్ధి పనులను చేపట్టడం జరుగుతుందన్నారు. కాలనీవాసులు అభివృద్ధి పనుల్లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు రఘు నాథ్‌రెడ్డి, జీహెచ్ఎంసీ అధికారులు ఈఈ శ్రీకాంతి, డీఈ ప్రవీణ్,ఏఈ సంతోష్ ఇరిగేషన్ అధికారులు పావని,ఎస్టీపీ డిజిఎం వసంత రెవెన్యూ శాఖ ఆర్.ఐ శీను,కాలనీవాసులు మాణయ్య, ప్రవీణ్ రెడ్డి, బాబు, శ్రీనివాస్, రియాజ్, కృష్ణమూర్తి, భాస్కర్, రాములు, నరేష్, బస్వారాజ్ , సుమంత్,టీఆర్ఎస్ నాయకులు వరలక్ష్మిరెడ్డి, ఓ. వెంకటేష్ , నరేందర్ భల్లా, కొండల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.