Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోనీ ఎన్టీఆర్నగర్ కాలనీలో రూ. కోటీ, 20 లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను కాలనీ వాసులతో కలిసి గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీసీ రోడ్డు నిర్మాణ పనుల్లో ఎక్కడా కూడా రాజీ పడకుండా నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఎన్టీఆర్ నగర్ కాలనీ వాసులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మౌలిక వసతుల కల్పించేందుకు కృషి చేస్తామన్నారు.కార్యక్రమంలో వర్క్ఇన్స్పెక్టర్ విశ్వనాథ్, ఎన్టీఆర్నగర్, కోశాధికారి వేణు గోపాల్ రెడ్డి, ఎన్టీఆర్ నగర్ సొసైటీ ఆర్గనైజింగ్ కార్యదర్శి నాగ సుబ్రహ్మణ్యం, సీనియర్ నాయకులు నర్సింగ్ నాయక్, రంగస్వామి ముదిరాజ్ ఎన్టీఆర్ నగర్ వాసులు పాల్గొన్నారు.