Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మండల నోడల్ ఆఫీసర్ సిఖిందర్రెడ్డి
- హుడాకాలనీ ప్రైమరీ స్కూల్‌ను నోడల్ ఆఫీసర్ సందర్శన
నవతెలంగాణ-శంషాబాద్
చదువులో వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మండల నోడల్ ఆఫీసర్ సిఖిందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం శంషాబాద్ మం డల పరిధిలోని శంషాబాద్ హుడాకాలనీ మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఆయన సందర్శించారు. పాఠశాలలో తరగతి విద్యాబోధన, బోధనా పద్ధతులు విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాలు, నైపుణ్యాలు, లెసన్ ప్లాన్, టీచర్స్ డైరీ, బోధన పరికరాలు తదితర అంశాలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన హెచ్ఎం ఎ.మల్లేష, ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. చదువులో వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. హరితహారం స్వచ్ఛ భారత్, మధ్యాహ్నం భోజనం, పరిసరాల పరిశుభ్రత, రికార్డుల కోసం నిర్వహణ బాగుం దని కితాబు ఇచ్చారు. ప్రాథమిక స్థాయిలో విద్యా ర్థులకు చదవడం, రాయడం, గణితంలో రాణిం చడం వంటి చతుర్విద ప్రక్రియలను సమర్ధ వంతంగా నేర్పించాలని ఉపాధ్యాయులకు తెలి పారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.