Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్థిత ప్రజ్ఞ
నవతెలంగాణ-శంకర్పల్లి
ఉపాధ్యాయులకు కార్పొరేట్ ఆస్పత్రిల్లో ఉచిత వైద్యం, హెల్త్ కార్డులు ఇవ్వాలని సీపీఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్థిత ప్రజ్ఞ అన్నారు. తెలంగాణ రాష్ట్ర కంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ రంగారెడ్డి జిల్లాలో ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదు కార్యక్రమం శంకర్పల్లి మండలలో ముఖ్య అథితిగా రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, కోశాధికారి నరేష్ గౌడ్, ఉపాధ్యక్షులు మ్యాన పవన్ కుమార్, దర్శన్ గౌడ్, మండలంలోని జిల్లా పరిషత్(బాలుర) పాఠశాలలోని ఉపాధ్యాయులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీపీఎస్ యూనియన్ సంఘం ఎమ్మెల్సీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని కోరారు. ఉద్యోగుల పాలిట గుదిబండలా మారిన సీపీఎస్ రద్దు చేసేందుకు కృషి చేస్తామన్నారు.ఇప్పటి వరకు గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ సాధించామనీ, ఇంకా సర్వీస్ పెన్షన్ మిగిలి ఉందనీ, దానిని కూడా త్వరలోనే సాధిస్తామన్నారు. జిల్లా అధ్యక్షులు ఎండి. తాహేర్ అలి మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు ఉపాధ్యాయ ప్రమోషన్లతో పాటే పండిట్-పి.ఇ.టి ఉపాధ్యాయుల పోస్టుల అప్గ్రేడేషన్ సాధిస్తామన్నారు. కేజీబీవీలలో పని చేస్తున్న ఉపాధ్యాయులు శ్రమ దోపిడీకి గురవుతున్నారనీ, వారికి స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ లేకపోవడం బాధా కరం, ట్రాన్స్ఫార్స్ లేకపోవడం, ఈ హెచ్ ఎస్ లాంటి సమస్యలను సాధించే బాధ్యత టీఎస్సీపీఎస్ఈయూ సంఘానిదేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు తాహేర్ అలి, జిల్లా కార్యనిర్వహక అధ్యక్షులు అశోక్,జిల్లా ప్రధాన కార్యదర్శి దూత కృష్ణ, మొయినాబాద్ అధ్యక్షులు శ్రీనివాస్ పాల్గొన్నారు.