Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే కాలె యాదయ్య
- మండల సర్వసభ్య సమావేశం
నవతెలంగాణ-శంకర్పల్లి
శంకర్పల్లి మండలంలోని వివిధ గ్రామాల అభివృద్ధికి ఐదు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్టు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాద య్య అన్నారు. శుక్రవారం శంకర్పల్లి మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ధర్మన్నగారి గోవర్ధన్ రెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. చేవెళ్ల నియోజకవర్గంలోని అన్ని గ్రామాల అభివృద్ధికి శాయశక్తుల కృషి చేస్తున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. శంకర్పల్లి మండలంలోని పొద్దుటూరు గేటు నుంచి గ్రామం వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనుల కోసం ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.2.5 కోట్లతో రోడ్డు పనులు జరుగుతున్నట్టు తెలిపారు. సబ్సిడీపై శనగలు, కుసుమలు, వరి అందుబాటులో ఉన్నా యని రైతులందరూ సద్విని చేసుకోవాలని వ్యవసాయ అధికారి సురేష్ బాబు తెలిపారు. ఇంద్రారెడ్డి నగర్లో నెలకొన్న విద్యుత్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని గ్రామ సర్పంచ్ సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షులు రవీందర్ గౌడ్ విద్యుత్ ఏఈని కోరగా, ఏఈ చక్రపాణి లెటర్ రాసి ఇవ్వండి పరిష్కరిస్తామన్నారు. సర్వేనెంబర్ 164లో ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని షేరిగూడ గ్రామ సర్పంచ్ సత్యనారాయణ వాపోయారు. రెవెన్యూ అధికారులు ఇరిగేషన్ అధికారులు సర్వే చేసి, ఆ భూమిని గ్రామపంచాయతీకి అప్పగించాలని కోరారు. మోకిలా వెంచర్లో ఇరిగేషన్ సంబం ధించిన సమస్యలు, వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులను ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి ఆదేశించారు. చందానగర్ రెవెన్యూ పరిధిలోని జన్వాడ గ్రామంలో మురికి నీరంతా ఫంక్షన్ హాల్ వద్ద నిలిచిపోతుందని నాలాను అడ్డుకోకుండా చూడాల్సిన బాధ్యత ఇరిగేషన్ అధికారులపై ఉందని మిర్జాగూడ గ్రామ సర్పంచ్ రవీందర్ గౌడ్ వాపోయాడు. అదేవిధంగా వెంకయ్య కట్ట ఫిరంగినాల హద్దులు ఫిక్స్ చేస్తే, రోడ్డు వేయడానికి వీలుంటుందని సర్పంచ్, ఎంపీటీసీ నాగేందర్ అన్నారు. జడ్పీటీసీ మహారాజ్‌పేట్ గ్రామానికి ఇప్పటివరకు ఎలాంటి నిధులు మంజూరు చేయలేదని ఆ గ్రామ సర్పంచ్ దోసాడ నరసింహారెడ్డి వాపోయారు. మండలంలో ప్రభుత్వ పాఠశాలలోని పాఠశాలలో చాలా అధ్వానంగా ఉన్నాయని ఉపాధ్యాయులు కూడా సమయపాలన పాటించకపోవడంతో విద్యార్థులకు చదవడం, రాయడం సక్రమంగా రావడం లేదని అడిషనల్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్టు శంకర్పల్లి ఎంపీడీవో వెంకయ్య అన్నారు. ఇకనుంచి ప్రతి వారంలో ఎంపీపీ,జడ్పీటీసీ,ఎంపీడీవోలు కలిసి పాఠశాలను తనిఖీ చేస్తారని తెలిపారు. మాసానికూడా గ్రామంలో ఆరు నెలల నుంచి మిషన్ భగీరథ నీరు రావడం లేదని ఆ గ్రామ సర్పంచ్ కొత్తపల్లి రాములు ఆరోపించారు. అదేవిధంగా శేరిగూడ కొండకల్ కొండకల్తండా గ్రామాలకు ఇప్పటివరకు మిషన్ భగీరథ నీరు రావడంలేదని ఆ గ్రామ సర్పంచ్ సత్యనారాయణ వాపోయాడు. గ్రామాల్లో పనులు చేసి,ఏండ్లు గడుస్తున్నా, రూర్బన్ నిధులు రాలేవని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోపులారం బ్రిడ్జి టెండర్ల ప్రక్రియ కొనసాగుతుందని పనులు త్వరతగతిన పూర్తి చేస్తారని గోపులారం గ్రామ సర్పంచ్ పొడవు శ్రీనివాస్ ప్రశ్నించారు. ఎస్సీ,ఎస్టీ చదివే విద్యార్థులకు పాఠశాలల్లో, కళాశాలలో ప్రభుత్వం వారికి కల్పిస్తున్న
స్కాలర్షిప్ గురించి ఎస్‌డబ్ల్యూఓ వెంకన్న క్లుప్తంగా వివరించారు. మహాలింగాపురం జిల్లా పరిషత్ పాఠశాల ప్రహరీ ఏమైందని ఎంపిటిసి యాదగిరి ప్రశ్నించారు. టంగుటూరు జిల్లా పరిషత్ పాఠశాలలో 102 మంది చదువుతుండగా నలుగురు ఉపాధ్యాయులు ఉండగా అందులో ఒకరు లాంగ్ లీవ్‌లో వెళ్లారనీ,దీంతో మరొకరిని డిప్యూటేషన్ పై పంపించడంతో ఇద్దరు టీచర్లు మాత్రమే 102 మంది విద్యార్థులకు చదువులు ఏలా చెబుతారని ఆ గ్రామ సర్పంచ్ గోపాల్ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో ఇంకో టీచర్‌ను పాఠశాలకు పంపిస్తానని ఎంఈఓ హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి, జడ్పీటీసీ గోవిందమ్మ గోపాల్ రెడ్డి, ఎంపీడీవో వెంకయ్య, డిప్యూటీ తహసీల్దార్ ప్రియాంక, పంచాయతీరాజ్ డీఈ జగన్ రెడ్డి, ఏఈ ప్రశాంత్ రెడ్డి, మిషన్ భగీరథ ఏఈ చంద్రమోహన్ రెడ్డి, మహారాజ్‌పేట్ సర్పంచ్ నరసింహారెడ్డి, పొద్దుటూరు సర్పంచ్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు ఏనుగు నరసింహారెడ్డి, ఎంపీఓ గీత, గాజుల గూడా ,లక్ష్మారెడ్డి గుడా సర్పంచులు శ్రీనివాస్ రెడ్డి , ప్రభాకర్ రెడ్డి, ఎంపిటిసిలు నాగేందర్, మేఘన సంజీవరెడ్డి, మల్లమ్మ,వెంకట్ రెడ్డి, శోభ సుధాకర్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు గ్రామ కార్యదర్శులు తదితరులు ఉన్నారు.