Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొడంగల్
యాదవుల సంస్కృతీ సంప్రదాయాల్లో భాగంగా కొడంగల్ పట్టణంలో శుక్రవారం యాదవ సంఘం నాయకులు ఘనంగా సదర్ ఉత్సవాలను నిర్వహించారు. దున్నపోతులను అందంగా ముస్తాబు చేసి గాడి భాయి శివాలయం నుండి వీధుల్లో ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. పలువురు యాదవ సంఘం నాయకులు డీజే నృత్యాలతో దున్న పోతులను ఆడిస్తూ యాదవ సంస్కృతిని చాటారు. ఇందులో భాగంగానే పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సదర్ ఉత్సవ వేదిక వద్ద స్థానిక ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, గొల్ల ,కురుమల కార్పొ రేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్‌లు దున్నపోతులకు స్వాగతం పలికారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ యాదవుల సంస్కృతీ సంప్రదాయాలను నేటితరం చిన్నారులకు పరిచ యం చేయాలని కోరారు. సేవే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పట్టణంలో ఘనంగా సదర్ ఉత్సవాలను నిర్వహించడం సంతోషకరమని కొనియాడారు. స్వచ్ఛమైన వెన్నె వలె గొల్ల, కురుమల మనసు ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ముద్దప్ప దేశ్‌ముఖ్, కౌన్సిలర్ మధుసూదన్ యాదవ్, దౌల్తాబాద్ ఎంపీపీి పటేల్ విజరు కుమార్, జడ్పీటీసీ కోట్ల మహిపాల్, సర్పంచ్ పకిరప్ప, సయ్యద్ అంజాద్ పాల్గొన్నారు.