Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కార్పొరేటర్ జగదీశ్వర్‌గౌడ్
నవతెలంగాణ-చందానగర్
దళితబంధు పథకం అర్హులందరికీ దశల వారిగా అందజేస్తామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథ కంలో భాగంగా హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని అంబేద్కర్ నగర్‌కి చెందిన యాదగిరికి మంజూరైన స్విఫ్ట్ డిజైర్ కారును మియాపూర్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ శుక్రవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దళితబంధు ఏడాదిలోనే 2 వేల మంది లబ్దిదారులకు అవకాశం కలిపిస్తామన్నారు. ఈ దళితబంధు పథకంతో కారును పొందిన లబ్దిదారుడు యాదగిరి మాట్లాడుతూ దళిత బంధుతో తాను దినసరి కూలి నుంచి కారు ఓనర్‌గా మారినట్టు వెల్లడించారు.ఈ సందర్భంగా తనను ఓనర్‌గా మార్చిన నేపథ్యంలో స్వీట్లు పంచుతూ, సీఎం కేసీఆర్‌కు, మంత్రి కేటీఆర్‌కు,ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే గాంధీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హఫీజ్పెట్ డివిజన్ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్‌గౌడ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, శేరిలిం గంపల్లి ఎస్సీ సెల్ అధ్యక్షులు రఘునాథ్,టీఆర్ఎస్ నాయకులు కృష్ణ ముదిరాజు, నాగరాజు, గోపాల్ ,సీతారాం తదితరులు పాల్గొన్నారు.