Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి కా. వనం సుధాకర్
నవతెలంగాణ-మియాపూర్
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా, పోరాటాలు నిర్వహించాలని ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి వనం సుధాకర్ అన్నారు. ఎంసీపీఐ(యూ) గ్రేటర్ హైదరాబాద్ కమిటీ ఆధ్వర్యంలో 3,4 తేదీల్లో మియాపూర్,ముజాఫర్ ఆహ్మద్నగర్లో సామాజిక, రాజకీయ శిక్షణా తరగతులు జరిగాయి. ఈ సందర్భంగా రెండోవ రోజు శిక్షణా తరగతులకు హాజరైన ఎంసీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వనం సుధాకర్ మాట్లాడుతూ దేశంలో బీజేపీ పార్టీ మతోన్మాద విధానాలను అవలంభిస్తూనే ప్రజలపై అనేక రకాలుగా ధరల భారాన్ని, జీఎస్టీ రూపంలో ఆర్థిక భారాన్ని మోపుతుందని ద్వజమెత్తారు. టీిఆర్ఎస్ ప్రభుత్వం పేద, సామాన్య ప్రజల సమస్యలను పరిష్కరించకుండా మౌలిక వసతులు కల్పించకుండా,మరింత సమస్యల సుడిగుండంలో నెట్టేవిధంగా పరిపాలన చేస్తుందన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను అనేక రకాలుగా పీడించే విధానాలను సృష్టిస్తూ దోపిడీ వర్గాలకు కొమ్ము కాస్తున్నాయనీ దుయ్యబట్టారు. మురుగు వాడలోని స్థానిక సమస్యలపై ప్రభుత్వాలను నీలదీసేందుకు బలమైన ప్రజా పోరాటాలను నిర్మించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి కా.వి.తుకారంనాయక్ అధ్యక్షతన నిర్వహించిన శిక్షణా తరగతుల్లో ఎంసీపీఐ(యూ) పార్టీ సభ్యులు 50 మంది పాల్గొన్నారు.