Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్టించుకోని అధికారులు
- మిషన్ భగీరథ ట్యాంకులు నిర్మించాలి:గ్రామస్తులు
నవతెలంగాణ-శంషాబాద్
గ్రామానికి తాగునీటిని అందించే ట్యాంకులు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి.దీంతో ఎప్పుడు కూలుతాయోనని గ్రామసుతలు ఆందోళన చెందుతున్నారు. ఇది శంషాబాద్ మండల పరిధిలోని రషీద్‌గూడ గ్రామంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితి. సుమారు 15 ఏండ్ల క్రితం గ్రామంలో ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకుతో పాటు మరో తాగునీటి ట్యాంకు నిర్మించారు. ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకుకు అక్క డక్కడ పగుళ్లు, పెచ్చులు ఊడిపోతున్నాయి. పక్కనే ఉన్న మినీ ట్యాంకు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నది . ట్యాంక్ వెలుపల మొత్తం నాచు పేరుకుపోయింది. ఎంత శుభ్రం చేసినా ట్యాంక్ పరిస్థితిలో ఏలాంటి మార్పు కనిపించడం లేదు. లీకేజీలు ఇతర కారణాలతో ట్యాంకు ప్రమాదకరంగా మారింది. నాచు , ఫంగస్ ఇతర గడ్డి పదార్థాలతో నిండిపోయిన ట్యాంకు నుంచి వచ్చే నీళ్లను తాగితే రోగాలు వస్తాయని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మండలంలో దాదాపు అన్ని గ్రామాలకు మిషన్ భగీరథ ట్యాంకులు నిర్మించినప్పటికీ రషీద్ గూడ గ్రామం తో పాటు అనుబంధ గ్రామం పోశెట్టి గూడలో మిషన్ భగీరథ ట్యాంకులు నిర్మించలేదు. ఈ విషయంపై సంబంధిత అధికారులకు పలుమార్లు విన్నవించినప్పటికీ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రమాదకరంగా ఉన్న పాత ట్యాంకులను కూల్చి, రషీద్ గూడ, పోశెట్టిగూడ గ్రామాల్లో మిషన్ భగీరథ ట్యాంకులు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.