Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర కార్యదర్శి దామోదర్ యాదవ్
నవతెలంగాణ-షాద్నగర్
షాద్నగర్ పట్టణంలో అఖిల భారత యాదవ మహాసభ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి నడికూడ రఘునాథ్ యాదవ్ ఆధ్వర్యంలో రేపు జరిగే సదర్ ఉత్సవాలను జయప్రదం చేయాలని అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర కార్యదర్శి దామోదర్ యాదవ్ అన్నారు. శుక్రవారం షాద్నగర్ పట్టణంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దామోదర్ యాదవ్ మాట్లాడుతూ రాజకీయ పార్టీలకు అతీతంగా కురుమ యాదవ సోదరులు, బంధువులు ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ ఫరూఖ్ నగర్ మండల అధ్యక్షులు బాలమోని మల్లేష్ యాదవ్, పట్టణ అధ్యక్షుడు నక్క బాలరాజు యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు పద్మారం వెంకటేష్ యాదవ్, అశోక్ యాదవ్, ధర్మతేజ యాదవ్, చెన్నకేశవులు యాదవ్, కిషోర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.